కొందరు స్టూడెంట్స్ రోడ్డుకు ఇరువైపులా కూర్చుని ఎగ్జామ్స్ రాస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ రోడ్ మీద వెహికల్స్ కూడా వెళ్తూ ఉండడం అందులో కనిపిస్తోంది. బీహార్ లోని సివాన్ జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వారి స్టూడెంట్స్ కోసం ఈ ఎగ్జామ్స్ నిర్వహించగా..సరైన సదుపాయాలు లేకపోవడంతో ఆ స్టూడెంట్స్ రోడ్డుకు రెండు వైపులా కూర్చుని ఎగ్జామ్స్ రాశారు. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది. వీటిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సరైన సదుపాయాలు లేకపోయినా కోచింగ్ సెంటర్స్ నిర్వహిస్తున్న వారిపై విమర్శలు చేస్తున్నారు. ఇక సదుపాయాలు లేకపోయినప్పటికీ చదువు మీద ఇంటరెస్ట్ చూపిస్తున్న స్టూడెంట్స్ పైన ప్రశంసలు కురిపిస్తూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎలాంటి సదుపాయాలు పెద్దగా లేకపోయినా కోచింగ్ సెంటర్లకు ఈ స్థాయిలో స్టూడెంట్స్ వెళ్తుండడంపై ప్రభుత్వంపైనా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.