అక్రమ వలసదారులకు అమెరికా అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. తమంతట తాము అమెరికాను వీడి వెళ్లే వారికి 2,600 డాలర్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. వీటితో పాటు వారి స్వదేశాలకు వెళ్లేందుకు ఫ్లైట్ లో ఉచితంగా పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే తాము స్వదేశానికి వెళ్తామని ‘సీబీపీ హోమ్’ యాప్ ద్వారా చెప్పే వారి పేర్లను బలవంతంగా స్వదేశాలకు తరలించే వారి లిస్టు నుండి తొలగించనున్నట్లు స్పష్టం చేసింది. తాము ఇస్తున్న ఆఫర్లను ఉపయోగించుకుని గతేడాది జనవరి నుండి ఇప్పటివరకు 22 లక్షల మందికి పైగా ఇల్లీగల్ ఇమిగ్రంట్స్ తమ దేశాలకు వెళ్లినట్లు తెలిపింది. ఎవరైతే అక్రమంగా ఉంటున్నారో తమ దేశానికి తామే స్వచ్ఛందంగా తిరిగి వెళ్లాలనుకుంటారో వారికి $2,600 నగదు మరియు ఫ్రీ విమాన టికెట్లను ప్రభుత్వం అందిస్తోంది. ఇలా వెళ్ళేవారిపై భవిష్యత్తులో ఉండే చట్టపరమైన ఆంక్షలను కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది.