భారత్ కు చేరుకున్న మరో ఇంధన షిప్ ‘జగ్ లాడ్కీ’

Spread the love

‘జగ్ లాడ్కి’ అనే భారత్ కు చెందిన ముడి చమురు నౌక నేడు  గుజరాత్‌ లోని ముంద్రా పోర్టుకు సేఫ్ గా  చేరుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి వచ్చిన ఈ షిప్ లో 80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉంది. ఈ షిప్ ను పుజైరా పోర్టులో లోడ్ చేశారు. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న పరిస్థితులతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. పర్షియన్ గల్ఫ్ ఇంధన మంటలతో భగభగలాడుతోంది. యుద్ధ పరిస్థితులతో అట్టడుకుతున్న వేళ, ప్రపంచమంతా చమురు కోసం అర్రులుచాస్తుంటే .. మన భారత్ మాత్రం తన దౌత్య చతురతతో గమ్యాన్ని చేరుకుంటోంది. ఇటీవలే భారత ఇంధన అవసరాలను తీర్చడమే లక్ష్యంగా సుదూర తీరాల నుండి భారీ నౌకలు స్వదేశానికి చేరుకున్నాయి.  ‘శివాలిక్’ నౌక గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరింది. ఖతార్ నుంచి బయలుదేరిన ‘నందాదేవి’ అనే భారీ షిప్  9 రోజుల ప్రయాణం తర్వాత సురక్షితంగా భారత్‌ తాజాగా చేరుకుంది. ఈ నౌకలో ఏకంగా 46,000 టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *