మానవ మృగం సెక్స్ స్కామ్ లో ప్రధాన నిందితుడైన ఎప్స్టీన్ తో తన సంబంధాలపై మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తమ సంస్థ సిబ్బందికి క్షమాపణలు చెప్పారు. తాను ఎలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేస్తూ ఇద్దరు రష్యన్ యువతులతో సంబంధాలు ఉన్న విషయాన్ని ఒప్పుకున్నారు. అయితే వారిద్దరూ కూడా ఎప్స్టీన్ స్కామ్ లో బాధితులు కారని పేర్కొన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో మహిళలతో ఉన్న ఫోటోలపై స్పందిస్తూ అవి అతడు అడిగితే దిగిన ఫోటోలని వెల్లడించారు. అతని బాధితులతో, అతని చుట్టూ ఉండే మహిళలతో తనకెలాంటి సంబంధం లేదని ఎప్స్టీన్ ను కలుసుకోవడం గేట్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ లను ఆయన సమావేశాలకు తీసుకెళ్లడం పెద్ద తప్పు అని పేర్కొన్నారు. నా తప్పిదం వలన ఈ వ్యవహారంలో ఇరుక్కున్న వారందరికీ నేను క్షమాపణలు చెబుతున్నా అని తన స్టాఫ్ తో జరిగిన సమావేశంలో బిల్ గేట్స్ పేర్కొన్నారు.