మానవత్వాన్ని చాటుకున్న భారత్..ఇరాన్ కు వైద్య సాయం

Spread the love

భారత్ మరోసారి తనదైన మానవత్వాన్ని చాటుకుంది. ఇజ్రాయెల్-అమెరికా దాడులతో ఇరాన్ కుదేలవుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం కారణంగా మెడిసిన్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇరాన్ కు భారత్ ఎమర్జెన్సీ మెడికల్ సామగ్రితో కూడిన మొదటి విడత సాయాన్ని అందించింది. భారత్‌ లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇప్పటికే ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (IRCS) కి అప్పగించినట్లు వారు తెలిపారు. మానవతా దృక్పథంతో భారత్ వ్యవహరించిందని ఇరాన్ ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. భారత ప్రజలు చూపిన ఈ మానవతా దృక్పథానికి ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌ లో వైద్య సామాగ్రి కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే హోర్ముజ్ జలసంధి నుండి భారత నౌకల సురక్షిత ప్రయాణం కోసం జరుగుతున్న చర్చల్లో భాగంగా ఇరాన్ ఈ వైద్య సహాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. భారత్ తో పాటు మరికొన్ని దేశాలు కూడా ఇరాన్ కు సహాయాన్ని అందిస్తున్నాయి. ఇక ఈ యుద్ద పరిస్థితుల్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు భారత్ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *