చమురు రవాణాకు ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ ఫ్లాగ్ తో ఉన్న తౌస్కా అనే షిప్ ను అమెరికా దళాలు కాల్పులు జరిపి స్వాధీనం చేసుకున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోని అమెరికా సెంట్రల్ కమాండ్ తాజాగా విడుదల చేసింది. ఇరాన్(Iran) జెండాతో వెళుతున్న 900 అడుగుల పొడవున్న కమర్షియల్ షిప్ తాస్కా అమెరికా నేవీని దాటుకొని వెళ్లాలనుకొంది. ఈక్రమంలో హెలికాప్టర్ ద్వారా యూఎస్ నేవీ దళాలు ఆ షిప్ పై దిగి వారి అధీనంలోకి తీసుకున్నట్టు ఆ వీడియోలో ఉంది. ఇక అమెరికా దళాలు ఇరాన్ కు చెందిన వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకోవడంతో, అందుకు ప్రతికారంగా ఇరాన్ డ్రోన్ దాడులు చేస్తోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమెరికా సైనిక నౌకలపై ఇరాన్ దాడికి దిగినట్టు అక్కడి జాతీయ మీడియా పేర్కొంది. అయితే, ఈ ఘటనకు సంబంధించి అమెరికా దళాల నుంచి అధికారిక ప్రకటన రాలేదు.