ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. లెబనాన్ లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) దాడులనుముమ్మరం చేసింది. హెజ్బొల్లా చీఫ్ నయీమ్ ఖాసిం మేనలుడు అలీ యూసఫ్ హర్షీని బీరుట్ లో హతమార్చినట్లు ఐడీఎఫ్ నేడు తెలిపింది. అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన మరుసటి రోజే ఈ దాడి జరగడం ఉద్రిక్తతలకు దారితీసింది. మేము హిజ్బుల్లాపై పూర్తి శక్తితో, ఖచ్చితత్వంతో మరియు పట్టుదలతో దాడులను కొనసాగిస్తున్నాము. బీరుట్‌లో, హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ సెక్రటరీ జనరల్ నైమ్ ఖాసీంకు అత్యంత సన్నిహితుడు మరియు అతని వ్యక్తిగత కార్యదర్శి అయిన అలీ యూసుఫ్ ఖర్షీని మేము హతమార్చామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ తెలిపారు. అదే సమయంలో, నిన్న రాత్రి ఐడిఎఫ్ (IDF) దక్షిణ లెబనాన్‌లోని వరుస ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు చేసిందని వేలాది ఆయుధాలు, రాకెట్లు మరియు లాంచర్లను తరలించడానికి ఉపయోగించే క్రాసింగ్‌లు, అలాగే ఆయుధ డిపోలు, లాంచర్లు మరియు హిజ్బుల్లా ప్రధాన కార్యాలయాలపై దాడులు జరిగాయని తెలిపారు. ఇజ్రాయెల్ పౌరులకు వ్యతిరేకంగా ఎవరు చర్యలు చేపట్టినా వారు దెబ్బతింటారని ఉత్తరాది నివాసితులకు పూర్తి భద్రతను పునరుద్ధరించే వరకు, అవసరమైన ప్రతిచోటా మేము హిజ్బుల్లాపై దాడులను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.