దాదాపుగా గత 40 రోజులుగా అట్టుడుకుతున్న మిడిల్ ఈస్ట్ పరిస్థితి పరస్పరం ఇరాన్, అమెరికా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో శాంతించిందని ప్రపంచమంతా ఊపిరిపీల్చుకుంది. దీంతో చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని మొదట ఇరాన్ తెరిచింది. కానీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారియి. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీనితో జలసంధిని దాటేందుకు వచ్చిన షిప్ లు తిరిగి వెనక్కితగ్గాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికా, ఇరాన్ దేశాలు సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత కొన్ని షిప్ లు హర్మూజ్ జలసంధిని దాటాయి. అదే సమయంలో ‘ఏయూఆర్‌ఓయూఆర్ఏ’ నౌక ఈ జలసంధిని దాటేందుకు సిద్ధమైన సమయంలో ఉద్రిక్తతలు తిరిగి చోటు చేసుకున్నాయి. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో 250 మందికి పైగా మృతి చెందారు. దీనితో ఇరాన్ హర్మూజ్ ను మళ్లీ మూసివేసింది. దీనితో ముసందమ్ తీరం సమీపంలో ఈ నౌక వెనక్కి మళ్లిందని వార్తలు వస్తున్నాయి. హర్మూజ్‌ను దాటేందుకు సిద్ధమైన మరిన్ని షిప్ లు కూడా వెనుదిరిగినట్లు ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి.