వేలానికి సిద్ధం.!

Spread the love

Maurizio Cattelan Gold Toilet: ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విలాస వస్తువుల జాబితాలో మరో అద్భుతం చేరబోతోంది. ప్రముఖ ఆర్టిస్ట్‌ మౌరిజియో క్యాటల్లాన్‌ రూపొందించిన కొత్త బంగారు టాయిలెట్‌ త్వరలో వేలానికి రానుంది. ఆయన గతంలో రూపొందించిన బంగారు టాయిలెట్‌ను దుండగులు అపహరించుకుపోయారు. అలాంటిదే మరో బంగారు టాయిలెట్‌ను క్యాటల్లాన్‌ రూపొందించటంతో దానిని ఈ నెల 18న ప్రముఖ వేలం సంస్థ సౌత్‌బే వేలం వేయనుంది.

ఈ సందర్భంగా వెనుకటి సామెత ఒకటి గుర్తుకు చేసుకోవాలి.. ‘బంగారు చెప్పులైనా కాళ్లకే వసుకుంటాం’. వస్తువును వాడే దాన్ని బట్టి విలువ పెరుగుతుంది. ఇక్కడో మహానుభావుడు బంగారంతో టాయిలెట్ కమోడ్ తయారు చేశాడు. అచ్చంగా 18 క్యారెట్ల బంగారంతో తయారైంది. ఇది సాధారణ టాయిలెట్‌ కాదు, ‘కళా విలాసం’లో శిఖర స్థానం దక్కించుకున్న బంగారు టాయిలెట్‌. 18 క్యారెట్ల బంగారంతో తయారైన ఈ కళాఖండం మానవ ఆలోచనలు ఏ మేరకు వెళ్తున్నాయో అద్దంలా చూపిస్తోంది.

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆర్టిస్ట్‌ ‘మౌరిజియో క్యాటల్లాన్‌’ ఈ కమోడ్ తయారు చేసి వార్తల్లోకి ఎక్కారు. పూర్వం ఆయన చేసిన బంగారు టాయిలెట్‌ ‘అమెరికా’ (దానికి ఆ పేరు పెట్టారు)ను తయారు చేసి ఆశ్చర్య పరిచారు. దాన్ని న్యూయార్క్‌లో మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఇది సందర్శకుల దృష్టిని ‘ఆకర్షించింది’. తర్వాత బ్రిటన్‌లో ప్రదర్శనలో ఉంచగా.. దొంగలు దానిపై తమ కళను ప్రదర్శించారు. నాలుగు నిమిషాల్లోనే చోరీ చేశారు. అది కూడా ‘ఆర్ట్‌ అండ్‌ క్రైమ్‌ కలయిక’గా! అప్పటి నుంచి బంగారు టాయిలెట్‌ లభ్యం కాని వస్తువుల జాబితాలో చేరింది. దానిని కరిగించి బంగారు గొలుసు వేసుకున్నారేమో ఎవరికీ తెలియదు. కానీ క్యాటల్లాన్‌ లాంటి వ్యక్తి దాంతో ఆగలేదు. ఆయన మళ్లీ మరో బంగారు టాయిలెట్‌ తయారు చేశాడు. ఎందుకంటే కళాకారుడి మనసు అలాంటిది మరి. ఇప్పుడు ఈ కొత్త బంగారు కమోడ్ నెల 18న సౌత్‌బే వేలంలో మళ్లీ అందరిని అలరించనుంది.

విలాసాలపై వ్యంగ్యాన్ని చాటేలా రూపొందించిన ఈ కళాఖండాన్ని, ప్రముఖ వేలం సంస్థ సోత్’బీస్ ఈ నెల 18న న్యూయార్క్‌లో వేలం వేయనుంది. దీని కనీస ధరను సుమారు 10 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 83 కోట్లుగా నిర్ణయించారు, దీని బరువు ఏకంగా 101.2 కిలోలు.

ఈ టాయిలెట్‌కు ఒక ఆసక్తికరమైన కథనం ఉంది. 2016లో కాటెలాన్ ఇలాంటివి రెండు టాయిలెట్లను తయారు చేశారు. వాటిలో ఒకటి 2019లో ఇంగ్లండ్‌లోని బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లో ప్రదర్శనలో ఉండగా, దొంగలు ప్లంబింగ్‌తో సహా పెకలించుకుని పారిపోయారు. దొంగలు దానిని కరిగించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ దొంగిలించబడిన కళాఖండం ఇప్పటికీ దొరకలేదు. ప్రస్తుతం వేలానికి వస్తున్నది రెండవ టాయిలెట్, దీనిని 2017 నుంచి ఒక ప్రైవేట్ స్థలంలో భద్రపరిచారు.

కాటెలాన్ ఈ టాయిలెట్‌ను సంపన్నుల విలాసపు ప్రతీకగా రూపొందించారు. ఇంతకుముందు ఆయన గోడకు టేప్‌తో అతికించిన ఒక అరటిపండుని ‘కామెడియన్’ పేరుతో ప్ర‌ద‌ర్శించి దానిని 6.2 మిలియన్ డాలర్లకు విక్రయించి సంచలనాన్ని సృష్టించారు. అలాగే మోకాళ్లపై కూర్చుని ఉన్న హిట్లర్ శిల్పంను 17.2 మిలియన్ డాలర్లకు విక్రయించారు. 2016లో ఈయన రెండు బంగారు టాయిలెట్లను తయారు చేశారు. వాటిలో ఒకటి 2019లో ఇంగ్లండ్‌లోని బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లో ప్రదర్శనలో ఉండగా దొంగతనానికి గురైంది. దొంగలు టాయిలెట్‌ను ప్లంబింగ్‌తో సహా తొలగించి ఎత్తుకుని పారిపోయారు. ఇప్పటికీ అది దొరకలేదు. పోలీసుల అంచనా ప్రకారం దానిని కరిగించి ఉండవచ్చని భావిస్తున్నారు.

గతంలో, ఈ టాయిలెట్‌ను న్యూయార్క్‌లోని గుగ్గెన్‌హీమ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచినప్పుడు, దానిని ఉపయోగించేందుకు ఏకంగా లక్ష మందికి పైగా సందర్శకులు క్యూ కట్టారు. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ కోసం వాన్ గో పెయింటింగ్‌ను అడగ్గా, మ్యూజియం వారు దానికి బదులుగా ఈ బంగారు టాయిలెట్‌ను ఆఫర్ చేయడం చరిత్రలో నిలిచిపోయే సంఘటన.

ఈ కమోడ్ తయారీకి 100 కిలోల బంగారం వినియోగించారట. ఇంతటి కమోడ్ కేవలం ప్రదర్శనకు మాత్రమే. అదే దీనితో ఏదైనా అద్భుతమైన కళాఖండం నిర్మిస్తే.. బహూషా సందర్శకులు ఇందులో వింతేముంది అనుకునే వారేమో.. అందుకే క్యాటలాన్ కు వెరైటీగా ఉండాలని దీన్ని తయారు చేశారు. దీన్ని ప్రదర్శనకు మాత్రమే ఉంచుతారు. క్యాటల్లాన్‌ అయితే ఈ సారి తన కళను మరింత పదును పెట్టాడు. ప్రపంచం మళ్లీ అతని బంగారు ‘ఆలోచనల’ వెనుక పరుగులు తీస్తోందని మనం ఆలోచించాల్సింది. క్యాటల్లాన్‌ తన కళతో ఏం సందేశం ఇస్తున్నారు. ‘ఎంతటి విలువైన వస్తువైనా మానవుడి తర్వాతే’ననా.. లేక ‘ఎంతటి విలువైనదైనా మనిషి తలుచుకుంటే ఎలాగైనా ఉపయోగించగలడనా’. ఏది ఏమైనా గోల్డెన్ కమోడ్ ను ఊహించుకుంటేనే కొందరు క్యాటల్లాన్ పై విరుచుకుపడుతున్నారు. Maurizio Cattelan Gold Toilet.

ఈ నెల 8 నుంచి వేలం ముగిసే వరకు ఈ ‘అమెరికా’ టాయిలెట్‌ను సోత్’బీస్ ప్రధాన కార్యాలయంలోని ఒక బాత్రూంలో ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచుతారు. సందర్శకులు దీనిని దగ్గరగా చూడవచ్చు, కానీ గతంలో లాగా దీనిని ఉపయోగించుకునే అవకాశం మాత్రం ఉండదు. కేవలం చూడగలరు కానీ, ఫ్లష్ చేయలేరు. ఈ అరుదైన బంగారు కళాఖండాన్ని దక్కించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు పోటీ పడడం ఖాయం. మరో టాయిలెట్‌ను క్యాటల్లాన్‌ తయారు చేయటంతో ఈ నెలలో వేలం వేస్తున్నారు. దీనికి భారీ ధర పలుకొచ్చని భావిస్తున్నారు. క్యాటల్లాన్‌ బనానా ఆర్టిస్ట్‌గా కూడా ప్రసిద్ధి చెందారు.