సౌదీ అరేబియా 40 దేశాల నుండి కోళ్ల మరియు కోడిగ్రుడ్ల దిగుమతులపై నిషేధం విధించింది. ప్రపంచవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వైరస్ ల వంటి ఆందోళనల నేపథ్యంలో ఆ దేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల ఆరోగ్యం, ఫుడ్ సేఫ్టీ వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక భారత్ కూడా ఆ జాబితాలో ఉంది. 40 దేశాల నుండి కోళ్లు, గుడ్లపై సంపూర్ణ నిషేధం అమలులో ఉంటుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలు సహా అంటువ్యాధులు వంటి అంశాలను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇక బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్, చైనా, భారత్, జపాన్, ఇండోనేషియా, జర్మనీ, యూకే వంటి దేశాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. మరోవైపు 16 దేశాల్లోని నిర్దిష్ట ప్రాంతాలపై కూడా పాక్షిక ఆంక్షలు విధించింది. అమెరికా, ఆస్ట్రేలియా, భూటాన్, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలపై పాక్షిక ఆంక్షలు అమలవుతాయని పేర్కొంది. అయితే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ కు అనుగుణంగా వేడి చేసిన పౌల్ట్రీ మాంసం వాటి సంబంధిత ప్రొడక్ట్స్ పై ఈ నిషేధం వర్తించదని అధికారులు తెలిపారు.