జార్జియా లో వారణాసి… డ్యూయల్ రోల్ లో మహేష్ బాబు!

Spread the love

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కలిసి చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ ఇప్పటికే దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీ చర్చకు దారి తీసింది అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫాంటసీ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ జానర్‌లో రూపొందుతోంది. అందుకే భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ ఇంకా షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ కలిసి నిర్మిస్తున్నారు. కథ ఐతే రాజమౌళి తండ్రి  ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తో పాటు జక్కన్న తమ్ముడు ఎస్.ఎస్. కాంచి అందిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణీ సంగీతం సమకూరుస్తున్నారు. ఐతే లేటెస్ట్ఈ గా వినిపిస్తున్న గాసిప్ ఏంటో తెలుసా??? వారణాసి సినిమా లో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పాత్రలో ‘రుద్ర’ అనే శక్తివంతమైన యోధుడిగా కనిపించనుండగా, మరో పౌరాణిక ఘట్టంలో ‘రాముడు’గా దర్శనమివ్వనున్నారని టాక్. ఈ రెండు పాత్రలు కథలో కీలకంగా ఉండబోతున్నాయని సమాచారం. అబ్బో మహేష్ డ్యూయల్ రోల్ అంటే బ్లాక్బస్టర్ గ్యారెంటీ!

ఇక బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా  ‘మందాకినీ’ పాత్రలో నటిస్తుండగా, పృథ్వీ రాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే పాత్రను పోషిస్తున్నారు. ఇక షూటింగ్ విషయానికి వస్తే హైదరాబాద్ లో జరిగిన షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. సో,ఇప్పుడు నెక్స్ట్ షూటింగ్ కోసం సినిమా యూనిట్ జార్జియాకు వెళ్లనుంది. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే ఆ షెడ్యూల్‌లో ప్రధాన నటీనటులపై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంతో సాగే అడ్వెంచర్ భాగాలను విదేశీ లొకేషన్లలో గ్రాండ్‌గా చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ బ్లాక్స్, ఇంకా విస్తారమైన సెట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. రామాయణానికి సంబంధించిన భాగాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని రాజమౌళి వెల్లడించారు. సో, ఈ విషయం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

అలాగే, ఇది పూర్తిస్థాయి సైన్స్ ఫిక్షన్ సినిమా కాదని, ఫాంటసీ ఇంకా మైథలాజికల్ జానర్‌కు చెందినదేనని రాజమౌళి స్పష్టం చేశారు. పురాణాల నేపథ్యాన్ని ఆధునిక యాక్షన్ అడ్వెంచర్ శైలిలో మిళితం చేస్తూ, వేర్వేరు కాలప్రవాహాలను కలిపే విధంగా కథను రూపొందిస్తున్నామని తెలిపారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *