భూగోళంపై ఉంటారా? చరిత్రలో కలిసిపోతారా?..పాకిస్తాన్‌కు భారత ఆర్మీ చీఫ్ సింహగర్జన

Spread the love

గతేడాది జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ గాయం నుంచి తేరుకోకముందే.. పాకిస్థాన్ కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ ఊహించని రేంజ్ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘పాకిస్థాన్ ఈ భూగోళంపై ఉండాలా.. లేదా చరిత్ర పుటల్లో కలిసిపోవాలా అనేది వారే తేల్చుకోవాలి అంటూ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. గతేడాది జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదులను ఏరిపారేసింది.  పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది కీలక స్థావరాలను మన సైన్యం పూర్తిగా ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రమూకలను మట్టుబెట్టి భారత ఆర్మీ తన సత్తా ఏంటో నిరూపించింది. అయితే తాజాగా భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ పాకిస్థాన్ కు ఒక కీలక హెచ్చరిక జారీ చేశారు. పాక్ ఈ భూగోళంపై ఉండాలా లేదా చరిత్ర పుటల్లో కలిసిపోవాలా అనేది వాళ్లే తేల్చుకోవాలని స్పష్టం  చేశారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనైనా అణచివేసేందుకు భారత్ పూర్తి స్పష్టతతో ఉందన్నారు.  ఈ హెచ్చరికతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పాకిస్థాన్ ఆర్మీ, అణ్వాయుధాలు ఉన్న దేశాలు హుందాతనంగా ఉండాలంటూ సూక్తులు వల్లించడం  మొదలుపెట్టింది. భారత ఆర్మీ చీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ సైన్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పందించింది. ఇరుదేశాలు శాంతియుతంగా సహజీవనం సాగించాల్సిన అవసరం ఉందని పాక్ మిలిటరీ ఒక ప్రకటనలో పేర్కొంది. యుద్ధ వాతావరణం సృష్టించడం వల్ల కలిగే నష్టాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కావని తమను మ్యాప్ నుంచి తొలగిస్తామనే బెదిరింపులు మానుకోవాలంటూ పాక్ దైన్యంగా ప్రాధేయపడుతోంది. ఒకవేళ భారత్ చర్యలకు దిగితే ఆ పరిణామాలు జీర్ణించుకోలేరంటూ పాక్ ఆర్మీ పైకి గంభీరంగా ప్రగల్భాలు పలికినా అది మేకపోతు గాంబీర్యం అని ప్రపంచమంతా తెలుసు. భారతదేశం ఎల్లప్పుడూ ఉగ్రవాద నిర్మూలనకే మొగ్గు చూపుతుందని మన ఆర్మీ ఛీఫ్  తేల్చి చెప్పారు. ఈ హెచ్చరికలకు  భయపడిన పాకిస్థాన్ ఆర్మీ, ఇప్పుడు శాంతి మంత్రం పఠిస్తూ  నాటకాలాడుతోంది. భారత్ తో శాంతియుతంగా జీవించాలనుకుంటున్నట్లు చెబుతూనే, మరోవైపు వ్యూహాత్మక పరిణామాలు ఉంటాయంటూ చెబుతోంది. పాకిస్థాన్ గనుక తన వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఆ దేశ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని మన ఆర్మీ ఛీఫ్  హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ సైనిక నాయకత్వాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే స్పందించిన పాక్ సైన్యం, భారత్ రెచ్చగొట్టే ధోరణిని మానుకోవాలని కోరింది. దక్షిణాసియా ప్రాంతంలో మరో యుద్ధం వస్తే అది అందరికీ వినాశకరంగా మారుతుందని తెలిపింది. ఉగ్రవాదాన్ని ఆయుధంగా చేసుకుని భారత్ పైకి పంపితే ఊరుకునే ప్రసక్తే లేదని మరోసారి భారత్ తేల్చిచెప్పింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *