పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 15 ఏళ్ల మమతా నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వ సుదీర్ఘ పాలనకు ప్రజల తీర్పుతో తెరపడింది. ఇది కేవలం అధికార మార్పిడి మాత్రమే కాదు… ఇన్నాళ్లూ సామాన్యులను పీడించిన అరాచక శక్తులపై ఇప్పటి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 205 స్థానాల భారీ మెజారిటీతో విజయం సాధించిన సువేందు అధికారి సర్కార్ అక్రమార్కులను పరిగెత్తిస్తోంది. సువేందు అధికారి చేస్తున్న ఈ పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ అవినీతి నేతలపై విరుచుకుపడుతోంది. నిన్నటి దాకా అధికార గర్వంతో విర్రవీగిన టీఎంసీ బడా నేతలు… నేడు వణికిపోతున్నారు. నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పగ్గాలు చేపట్టడంతో బెంగాల్లో సరికొత్త శకం ఆరంభమైంది. ఇది కేవలం అధికార మార్పిడి మాత్రమే కాదు అరాచక శక్తుల అంతానికి ఆరంభం అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి రావడంతోనే సీఎం సువేందు తన పవర్ ఏంటో తన పట్టు ఏంటో ప్రత్యర్థులకు రుచి చూపిస్తున్నారు. అవినీతి నేతలకు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. ఎవర్నీ ఉపేక్షించేది లేదని చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేపీ బెంగాల్ నయా సర్కార్ స్పష్టం చేసింది. ఒకప్పుడు బీరాలు పలికిన టీఎంసీ బడా నేతలు ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్నారు. గతంలో సామాన్యులను పీడించిన నేతలు ఇప్పుడు ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. కట్ మనీ పేరుతో కోట్లకు తెరలేపిన నేతలను ఊర్లలోకి రానివ్వకుండా జనం తరిమికొడుతున్నారు. పశ్చిమ బెంగాల్ , బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. చొరబాటుదారులకు, అక్రమార్కులకు సువేందు సర్కార్ పూర్తిగా చెక్ పెట్టేసింది. బోర్డర్స్ నుండి సాగుతున్న రహస్య సొరంగాలన్నింటినీ ఆర్మీ, పోలీసులు ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తున్నారు. అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బడా నేతలు కొందరు బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని సొరంగాల్లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఇప్పుడు బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దులపైనే పడింది. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ బోర్డర్ సెక్యూరిటీని లేని విధంగా పటిష్టం చేశారు. ఇన్నాళ్లు దేశంలోకి అక్రమంగా చొరబడిన మూకలు ఇప్పుడు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. సొరంగాలు దాటి ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించిన ముఠాల ఆటలను సెక్యూరిటీ ఫోర్సెస్ అడ్డుకుంటున్నాయి. అసాంఘిక మూకలు ఎవ్వరూ కూడా కంటికి కనిపించకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోతున్నారు. బెంగాల్ గడ్డపై ఇప్పుడు బుల్డోజర్ల కవాతులు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. భూఆక్రమణదారుల ఇళ్లను అవినీతి నేతల సామ్రాజ్యాలను ఈ బుల్డోజర్లు బద్దలు కొడుతున్నాయి. అక్రమ వసూళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన టోల్ ప్లాజాల వద్ద సరికొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. సామాన్యులను వేధించిన వసూల్ రాజా ముఠాల ఆట కట్టించారు. పశ్చిమ బెంగాల్ ముఖచిత్రంపై ఇదొక పెను సంచలనంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. బెంగాల్లో అవినీతి తిమింగలాలను కొత్త సర్కార్ వేటాడుతోంది. మమతా బెనర్జీకి అత్యంత దగ్గర వ్యక్తిగా చెప్పుకునే మాజీ మంత్రి బోస్ సమియమ్ అహ్మద్ నివాసాలపై ఈడీ అధికారులు, పోలీసులు ఉమ్మడిగా దాడులు జరిపారు. ఈ సోదాల్లో ఊహించని విధంగా భారీగా అత్యాధునిక ఆయుధాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. చట్టం ముందు ఎంతటి వారైనా లొంగాల్సిందేనని ఈ దాడులతో సువేందు సర్కార్ నిరూపించింది.