హెల్త్ ఇంకా ఫిట్నెస్ కోసం.. కాస్త డ్యాన్స్ చేద్దామా!

Spread the love

మారుతున్న జీవనశైలి.. యవ్వనంపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అందంతోపాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. ఫలితంగా ముప్ఫైఏళ్లకే ముఖంలో కల లేకుండా పోతుంది. ముడతలు పడి ‘ముదిమి’ వస్తుంది. నలభైల్లోనే ఊబకాయం, మధుమేహం వల్ల శరీరం ఫిట్‌నెస్‌ కోల్పోతున్నాం. ఇలాంటప్పుడు ఈ సమస్యలన్నిటినీ ఒకేఒక్క ‘డ్యాన్స్‌’ తరిమేస్తుందంటే నమ్ముతారా…

రోజూ ఓ గంటసేపు డ్యాన్స్ చేస్తే.. యంగ్ అండ్ ఎనర్జిటిక్ లుక్ తో శరీరాన్నీ షార్ప్‌గా మార్చేస్తుంది. డ్యాన్స్ వల్ల.. ఫేషియల్‌ ఎక్సర్సైజ్ లు చేసినట్లవుతుంది కాబట్టి ముఖ కండరాలు బలంగా తయారవుతాయి. ముఖంపై గీతలు, ముడతలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. రక్త ప్రసరణతోపాటు గ్లో పెరుగుతుంది.

  • కొన్నిరకాల ఏరోబిక్‌ డ్యాన్స్‌ వ్యాయామాలు.. మెదడులో జ్ఞాపకశక్తిని నియంత్రించే హిప్పోకాంపస్‌ ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపిస్తూ.. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
  • నచ్చిన పాట వింటూ చేసే డ్యాన్స్ వల్ల స్ట్రెస్ తగ్గుతుంది.
  • ఉత్సాహంగా వేసే స్టెప్పుల వల్ల నిరాశ పోతుంది.
  • వేసే స్టెప్పుల వల్ల శరీరంలో సెరటోనిన్‌ హార్మోన్‌ స్థాయులు పెరిగి, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. శరీరమే కాదు, ఆలోచనలూ నూతనంగా మారతాయి.
  • డ్యాన్స్‌ చేస్తున్నంత సేపు శరీరం ఎనర్జిటిక్ గా ఊగిపోతుంది. ఫలితంగా ఫిట్‌నెస్‌ బాగుంటుంది. బరువు అదుపులోకి రావడంతోపాటు శరీరం నాజూగ్గా తయారవుతుంది.
  • ఎంత వేగంగా డ్యాన్స్‌ చేస్తే.. అంతగా హృదయ స్పందన వేగం పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. దీర్ఘకాలంలో లైఫ్ స్పాన్ ను పెంచుతుంది.
  • ఇక భాగస్వామితో కలిసి చేసే డ్యాన్స్‌.. బంధాలను మరింత బలపరుస్తుంది. ఫలితంగా, ఆనంద భావనలు పెరిగి, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గి, రోగ నిరోధక వ్యవస్థ దృఢంగా మారుతుంది.