చిన్న విషయాలను కూడా ఏఐనే అడిగేస్తున్నారా..?!

Spread the love

AI Recent Survey Says: రెస్టారెంట్‌కు వెళ్లి ఏ ఫుడ్‌ ఐటమ్‌ ఆర్డర్‌ ఇవ్వాలి దగ్గర్నుంచి, గిఫ్ట్‌ షాపుకెళ్లి ఏం కొనాలో తెలియక తికమక పడటం, షాపింగ్‌కి వెళ్లి ఏ డ్రెస్‌ కొనాలో తేల్చుకోలేకపోవడం కొన్నిసార్లు అందరం ఎక్స్‌పీరియన్స్‌ చేసే ఉంటాం! నిజానికి ఈ సమస్య మీ ఒక్కకరిదే కాదు.. ప్రస్తుతం దేశంలో ఎక్కువశాతం మంది అతిగా ఆలోచిస్తూ చిన్న చిన్న విషయాలను కూడా డిసైడ్‌ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో చాలామంది టెక్నాలజీని ఆశ్రయించడం పరిపాటిగా మారిందని రీసెంట్‌ ఓ సర్వేలో తేలింది.

ఏదీ తేల్చుకోలేక అయోమయంలో పడినపుడు క్లారిటీ కోసం చాట్‌జీపీటీ లేదంటే గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ని అత్యధిక సంఖ్యలో భారతీయులు ఉపయోగిస్తున్నట్లు సెంటర్‌ ఫ్రెష్‌, యూగవ్‌ సంయుక్తంగా నిర్వహించిన సర్వే రిపోర్ట్‌ చెబుతోంది. AI Recent Survey Says.

ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు నిర్ణయాల్లో సాయం కోసం టెక్నాలజీని ఆశ్రయిస్తున్నట్లు తేలింది. 2,100 మంది భారతీయులతో శాంపిల్‌ సర్వే నిర్వహించగా తాము రోజులో మూడు గంటలు అతిగా ఆలోచిస్తున్నామని అందులో 81శాతం మంది ఒప్పుకున్నారు. అదో నిత్య అలవాటుగా తమకు మారినట్లుగా చెబుతున్నారు. దేశవ్యాప్తంగా టైర్‌ 1, 2, 3 నగరాల్లో ఈ సర్వే జరిగింది. ఆహారం, జీవనశైలి అలవాట్లు, డిజిటల్‌ సోషల్‌ లైఫ్‌, డైటింగ్‌, రిలేషన్‌షిప్స్‌, కెరీర్‌ వంటి పలు అంశాలపై ఈ సర్వే కండక్ట్ చేశారు. చిన్న చిన్న విషయాలపై నిర్ణయం తీసుకోవడంలో కూడా అతిగా ఆలోచించడం భారతదేశ ప్రజల దైనందిన జీవితంలో భాగమైపోయినట్లు ఈ సర్వే తేల్చి చెప్పేసింది.

Also Read: https://mega9tv.com/technology/bsnl-freedom-plan-unlimited-calls-for-rs-1/