మోనోడైట్‌ మంచిదా..? కాదా..?

Spread the love

బరువు తగ్గాలనుకునేవాళ్లు, మంచి ఫిట్నెస్ కోసం.. రకరకాల డైట్‌ ప్లాన్‌లు ఫాలో అవుతుంటారు కదా.. ఇందుకోసం రోజుల తరబడి తినకుండా ఉంటారు. తినే విధానాన్ని మార్చుకుంటారు. ఇలా వెయిట్‌ లాస్‌ కోసం తహతహలాడుతున్న వారికోసం పరిచయమైన నయా ట్రెండ్‌ లో మోనోడైట్‌ కూడా వినిపిస్తుంది. అసలు దీనివల్ల కలిగే మేలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ విధానంలో రోజంతా లేదా.. ఒక పూట భోజనంలోగానీ ఒకే రకమైన ఆహారం తీసుకోవడాన్ని మోనో డైట్‌గా చెబుతారు. ఫర్ ఎక్సంఫుల్.. ఒక రోజు కేవలం అరటిపళ్లు మాత్రమే తినాలి లేదంటే కేవలం ఎగ్ వెరైటీలపై ఆధారపడాలి. ఇలా చేయడం వల్ల సులువుగా బరువు తగ్గొచ్చని కొందరు చెబుతున్నారు. నిజానికి హాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు చాలామంది సెలెబ్రిటీలు సైతం దీన్ని ఫాలో అవుతున్నారు. ఆ స్టార్లను అభిమానించేవాళ్లు వారిని ఫాలో అవ్వడంతో పాటు.. వాళ్ళు ఫాలో చేసే ఈ డైట్ లను ఫాలో చేస్తున్నారు. ఈ పద్ధతిలో బరువు తగ్గడం సాధ్యమేనా అంటే.. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

కొన్ని రోజులపాటు ఈ డైట్‌ ఫాలో అయితే బరువు తగ్గినట్టు తాత్కాలికంగా అనిపించవచ్చు. కానీ, ఇది ఎక్కువగా శరీరంలో నీటిని తగ్గిస్తుందే తప్ప కొవ్వును కరిగించదు.
మళ్లీ రెగ్యులర్‌ డైట్‌కు మళ్లినప్పుడు మరింత బరువు పెరిగే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, తగినంత శారీరక శ్రమ చేస్తుంటే.. క్రమపద్ధతిలో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల, మోనోడైట్‌కు బదులుగా పోషకాలన్నీ సమతులంగా ఉండే ఆహారం తీసుకుంటేనే మేలు.

యాడిటివ్స్‌, కృత్రిమ తీపి పదార్థాలు, మనం గుర్తించలేని రసాయనాలు ఉన్న వాటిని చూసి తినాలి. సోడా, ఫ్లేవర్డ్‌ జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌కు సాధ్యమైనంత వరకు దూరం ఉండాలి. నీళ్లు, హెర్బల్‌ టీలు, ఇంట్లో తయారుచేసుకున్న స్మూతీలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. చిప్స్‌, క్యాండీలు, ప్యాకేజ్డ్‌ స్నాక్స్‌ స్థానంలో తాజా పండ్లు, గింజలు, యోగర్ట్‌కు చోటివ్వాలి.

ముందే ప్యాకై వచ్చిన సాస్‌లకు బదులు ఇంటి దగ్గరే తాజాగా తయారుచేసుకుంటే మేలు. బాగా మరపట్టిన బియ్యం, రిఫైన్డ్‌ పాస్తా, ప్రాసెస్డ్‌ ధాన్యాల కంటే బ్రౌన్‌ రైస్‌, క్వినోవా, హోల్‌ వీట్‌ బ్రెడ్‌, ఓట్స్ తీసుకోవచ్చు. వీటితో మనకు ఎక్కువ ఫైబర్‌, మరిన్ని పోషకాలు అందుతాయి.