
ఐపీఎల్ 18వ సీజన్ విజేతగా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. పంజాబ్ కింగ్స్‌పై కేవలం ఆరు పరుగులు తేడాతో విజయం సాధించి తొలిసారి కప్‌ను గెలిచింది. మ్యాచ్ విన్నింగ్ కు కారణమైన ప్లేయర్స్, జట్టు ఎంత కీలకమో..
విన్నింగ్ ప్రైజ్ మనీ కూడా అంతే సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఐపీఎల్‌లో ఖర్చు చేసిన మొత్తంతో లీగ్ ఎప్పుడూ సెన్సేషన్ అవుతూ వస్తుంది. ఐపీఎల్‌లో విజేతలతో పాటు పలు అవార్డులు సైతం ఇచ్చే విషయం తెలిసిందే. కాగా ఐపీఎల్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ దక్కడం విశేషం. రన్నరప్ గా నిలిచిన పంజాబ్ కింగ్స్‌కు రూ.12.5 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. ఇందులో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, ఫెయిర్ ప్లే అవార్డులున్నాయి.
ఏ ఆటగాడికి ఏ అవార్డు వచ్చిందంటే..?
- జితేశ్ శర్మ- సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్-రూ.లక్ష రివార్డు,
- శశాంక్ సింగ్- ఫాంటసీ కింగ్ ఆఫ్ ది మ్యాచ్- రూ.లక్ష రివార్డు, సూపర్ సిక్సర్స్ ఆఫ్ ది మ్యాచ్- రూ.లక్ష రివార్డు,
- ప్రియాన్ష్ ఆర్యా- మ్యాచ్‌లో అత్యధిక ఫోర్లు- రూ.లక్ష రివార్డు,
- కృనాల్ పాండ్యా- గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది మ్యాచ్- రూ.లక్ష రివార్డు, మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్- రూ. 5లక్షల పారితోషకం,
- సాయి సుదర్శన్- ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, రూ.10 లక్షల రివార్డు, ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్- రూ.10 లక్షల రివార్డు, ది గో ఫోర్స్ ఆఫ్ ది సీజన్- రూ.10 లక్షలు క్యాష్ ప్రైజ్,
- వైభవ్ సూర్యవంశి- సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది సీజన్- టాటా కర్వ్ కారు విజేత,
- నికోలస్ పూర్- సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్, రూ.10 లక్షలు
- మొహ్మద్ సిరాజ్- గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది సీజన్- రూ. 10 లక్షల రివార్డు,
- కమిండు మెండిస్- క్యాచ్ ఆఫ్ ది సీజన్- రూ. 10 లక్షల క్యాష్ ప్రైజ్,
- ఫెయిర్ ప్లే అవార్డు- చెన్నై సూపర్ కింగ్స్- రూ.10 లక్షల ప్రైజ్‌మనీ,
- ప్రసిద్ధ్ కృష్ణ- పర్పుల్ క్యాప్- రూ.10లక్షల రివార్డ్,
- సాయి సుదర్శన్- (ఆరెంజ్ క్యాప్- 759 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్) రూ.10లక్షల రివార్డ్,
- సూర్యకుమార్ యాదవ్ (మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్) రూ.15లక్షల రివార్డు
- డీడీసీఏ (పిచ్ అండ్ గ్రౌండ్) రూ.50లక్షలు అందుకున్నారు.