మెదడు హెల్తీగా ఉండేందుకు ఒమేగా!

Spread the love

మన మెదడు హెల్తీగా ఉండాలంటే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. వీటి ద్వారా మెదడు శక్తిని పెంచుకోవచ్చు. మానసిక అశాంతిని తగ్గించుకోవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ల కోసం నాన్ వెజ్ మాత్రమే తినాల్సిన పని లేదు. వీటిల్లోనూ దొరుకుతుంది.

  • ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌ లు, ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల మెదడు శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. రోజూ ఒక టీస్పూన్ పొడి రూపంలో తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది.
  • కిడ్నీ ఆకారంలో ఉండే కిడ్నీ బీన్స్ శక్తివంతమైన పోషకాలకు నిలయం. ఇందులో ఉండే ఐరన్, ఫోలేట్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌ ల వల్ల మెదడు పనితీరును మెరుగుపడుతుంది. వంటల్లో లేదా సలాడ్‌ ల రూపంలో వీటిని తినవచ్చు.
  • చియా గింజల్లో ఉండే అల్ఫాలినోలెనిక్ యాసిడ్ (ALA), ఒమేగా 3, డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు రక్షణ కల్పిస్తాయి. ఉదయం నానబెట్టిన నీటిలో లేదా జ్యూస్‌ లో కలిపి తీసుకుంటే మరింత మంచిది.
  • వాల్‌ నట్స్‌లో అధిక మొత్తంలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌ లు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. రోజు రెండు లేదా మూడు వాల్‌ నట్స్ తీసుకుంటే మెదడుకు కావలసిన మెమరీ పవర్ఫుల్ అవుతుంది.
  • అవిసె గింజల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ (ALA), ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీలు సమపాళ్లలో ఉంటాయి. మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు గుండెకు ఆరోగ్యాన్నిస్తాయి. వీటిని పొడి చేసి సలాడ్, పప్పులపై చల్లి తీసుకోవచ్చు.