టిపీసీసి కార్యవర్గం ఇప్పట్లో లేనట్లేనా..?

Spread the love

అదిగో ఇదిగో అంటున్నారే తప్ప అసలు మ్యాటర్ ముందుకు వెళ్లడం లేదు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా..ఇంకా తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీ కార్యవర్గం కొలువుదీరడం లేదు. అతి త్వరలోనే అని పీసీసీ చెప్పినా అడుగుముందుకు పడకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. అంతా ఓకే అనుకున్న తర్వాత అసలు నూతన కార్యవర్గం ప్రకటన ఆలస్యం ఎందుకవుతోంది? టిపీసీసి కార్యవర్గం ఇప్పట్లో లేనట్లేనా..? అసలు చిక్కుముడి ఎక్కడ ఉంది? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17నెలలు అవుతున్నా ఇంకా పూర్తి స్థాయి కార్యవర్గం ప్రకటించలేదు,పీసీసీ అధ్యక్షుడు గా మహేష్ గౌడ్ ఎంపిక అయ్యి 8 నెలలు గడిచినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నూతన కార్యవర్గ నియామక ప్రక్రియ చేపట్టలేదు. అయితే 8 నెలల తర్వాత పీసీసీ కి నూతన కమిటీ ఏర్పాటుకు ముందడుగు పడిందని 70 మందితో కూడిన లిస్ట్ ను రెండు రోజుల కిందట హై కమాండ్ ప్రకటించింది. కానీ పీసీసీ కార్యవర్గం ఎంపిక మాత్రం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. అందులో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ల ఎంపిక హైకమాండ్ కు సవాలుగా మారిందని సమాచారం. నలుగురు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుల నియమించాలని భావించిన ఏఐసీసీ ..సామాజిక సమీకరణాల ఆధారంగా భర్తీ చేయాలని నిర్ణయించింది. అందులో ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించలని అధిష్టానం భావిస్తుందట. ఈ కోటాలో ఎస్సీ నుండి సంపత్ కుమార్, ఎస్టీ కోటాలో ఎంపీ బలరాం నాయక్, లేదా బెల్లయ్య నాయక్, ఓసీ కోటాలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, మైనార్టీ కోటాలో ఫహీం ఖురేషి పేర్లను ప్రతిపాదించారట రాష్ట్ర నేతలు.

అయితే కాంగ్రెస్ అధిష్టానానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ల ఎంపిక హెడ్ హేక్ గా మారిందని తెలుస్తుంది.నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల పేర్లలో ముగ్గురి పేర్లు ఫైనల్ అయినప్పటికీ మైనారిటీ విషయంలో ఎవరికి ఇవ్వాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతుందని సమాచారం. మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్,ఫహీం ఖురేషి పేర్లు ప్రతిపాదించగా సీఎం రేవంత్ రెడ్డి తన సన్నిహితుడు ఫహీం ఖురేషి పేరు ను ప్రతిపాదించారట.సీఎం రేవంత్ రెడ్డి ఫహీం ఖురేషి కి ఇవ్వాలని పట్టుబడుతుంటే, ఫీరోజ్ ఖాన్ మాత్రం తనకు ఇవ్వాల్సిందేనని అంటున్నారట.మరోవైపు కాంగ్రెస్ సీనియర్లు మాత్రం ఫహీం ఖురేషి పేరు పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని చర్చ జరుగుతుంది. మైనార్టీ క్యాస్ట్ లో బలమున్న నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని హై కమాండ్ కు సూచిస్తున్నారట. ఎందుకంటే హైదరాబాద్ కాంగ్రెస్ వీక్ గా ఉందని,రానున్న ghmc ఎన్నికల్లో పాగా వేయాలంటే పట్టున్న మైనారిటీ నేతకు ఇవ్వాలని అంటున్నారట. కాగా సిఎం రేవంత్ రెడ్డి మూడు రోజులు హస్తినలో ఉన్న క్రమంలో ఫహీం ఖురేషి కి వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పారట . సీఎం రేవంత్ కు సన్నిహితంగా ఉండే ఫహీం పేరు విషయంలో హైకమాండ్ ఎటు తేల్చుకోలేకపోతుందట. దీంతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ల ఎంపికను మరికొంత కాలం పెండింగ్ లో పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ ల ఎంపిక చిక్కు ముడి సంగతి అటుంచితే పీసీసీ జంబో కార్యవర్గం పైన అధిష్టానం అభ్యంతరం వ్యక్తం చేస్తోందట. 40 కి పైగా ఉపాధ్యక్షులు, 80 పైగా ప్రధాన కార్యదర్శుల పేర్లను అధిష్టానానికి ప్రతిపాదించిందట పీసీసీ. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఉపాధ్యక్షులను, జనరల్ సెక్రటరీల నియామకం పై అభ్యంతరాలు వ్యక్తం చేసిందట హైకమాండ్. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సంఖ్యను ప్రతిపాదించడం ఏంటని ప్రశ్నించారట ఏఐసీసీ పెద్దలు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని హై కమాండ్ పెద్దలకు అంతా వివరించారట పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ , సీఎం రేవంత్. దీంతో అధిష్టానం కార్యవర్గం తుది కసరత్తు చేసి ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.

మొత్తానికి పీసీసీ నూతన కార్యవర్గం ఎంపిక హైకమాండ్ కు కత్తిమీద సాములా తయారైంది. క్లిష్టంగా మరీన పీసీసీ నూతన టీమ్ ఎంపిక ను ఏఐసీసీ ఎలా ఏర్పాటు చేస్తుందో వేచి చూడాలి.