పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా లో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందారు. ఈ రోజు ఉదయం బంగ్లాదేశ్ లో భూ కంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం సుమారు 1:52 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4 గా నమోదైంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భారత్ లో ఈ భూకంప ప్రభావం పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ పై కూడా పడింది. ముఖ్యంగా కోల్కతా మరియు దాని పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు స్పష్టంగా కనిపించినట్లు వార్తలు వస్తున్నాయి.