మార్పు కోరుకున్న మలయాళీలు.. కేరళలో యూడీఎఫ్ (UDF) కి పట్టం

Spread the love

కేరళలో ఎర్రకోట కూలిపోయింది, మలయాళీలు ఈసారి మార్పు కోరుకుంటూ యూడీఎఫ్ (UDF) కి పట్టం కట్టారు. కేరళ ఓటర్లు ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. పినరయి విజయన్ ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను చూపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు.  మైనారిటీ ఓట్ల ధ్రువీకరణ,  ప్రభుత్వ వ్యతిరేకత యూడీఎఫ్‌కు భారీ ప్లస్ పాయింట్లుగా మారాయి. కూటమి అపూర్వ విజయం సాధించింది. మొత్తం 140 స్థానాలకు గాను ఇప్పటికే 100 సీట్లు గెలుచుకొని.. రెండు సీట్లలో ముందంజలో  కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దివంగత సీఎం ఊమెన్ చాందీ తనయుడు చాందీ ఊమెన్ పూతుపల్లి నుండి గ్రాండ్ విక్టరీ కొట్టారు. తన ప్రత్యర్థి, ఎల్డీఎఫ్ అభ్యర్థి కేఎం రాధాకృష్ణన్ పై  52,907 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక పుదుచ్చేరి విషయానికి వస్తే అక్కడ మళ్ళీ రంగస్వామి తన అధికారాన్నినిలబెట్టుకున్నారు.  కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులు,  సంక్షేమ పథకాలు ఎన్డీయే కూటమికి ఘన  విజయాన్ని అందించాయి. చిన్న రాష్ట్రమైనా పుదుచ్చేరిలో రంగస్వామి ఛరిష్మా వర్కౌట్ అయింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *