బెంగాల్, అస్సాంలలో బీజేపీ విజయం పట్ల యూపీ సీఎం హర్షం 

Spread the love

ప్రధాని మోడీ విశిష్ట నాయకత్వం మరియు ప్రజా సంక్షేమ విధానాలపై దేశప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసం, నేడు అసెంబ్లీ ఎన్నికల చారిత్రాత్మక ఫలితాల్లో మరోసారి ప్రతిబింబించిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. పశ్చిమ బెంగాల్‌ లో తొలిసారిగా, అసోంలో వరుసగా మూడవసారి మరియు పుదుచ్చేరిలో రెండవసారి బిజెపి-ఎన్‌డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఈ అపారమైన విశ్వాసానికి నిదర్శనమని  ప్రజలు అందించిన ఈ అపూర్వమైన తీర్పు, ‘నవ భారతం-వికసిత భారతం’ అనే ప్రధానమంత్రి మహోన్నత సంకల్ప నెరవేర్పునకు నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ బెంగాల్, బీజేపీ అస్సాంలకు మరియు బీజేపీ పుదుచ్చేరిలకు అభినందనలు తెలిపారు. పార్టీలో అంకితభావం కలిగిన పదాధికారులకు, అవిశ్రాంతంగా శ్రమించిన కార్యకర్తలకు మరియు విజేతలను అభినందించారు. సుపరిపాలన మరియు జాతీయవాదంపై తమ అమూల్యమైన ఆశీస్సులు అందజేసిన ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *