భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా సోషల్ మీడియాలో అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఇటీవలే ఇన్స్టాగ్రామ్ లో మన ప్రధాని మరో వరల్డ్ రికార్డు సృష్టించారు. 100 మిలియన్ల (10 కోట్లు) ఫాలోవర్ల మార్క్ ను దాటిన మొదటి ప్రపంచ నేతగా అరుదైన ఘనత కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. 2014లో ఇన్స్టాగ్రామ్ లో చేరిన ఆయన అనతికాలంలోనే ఈ అరుదైన ఘనతను అందుకోవడం గమనార్హం. ఇక తాజాగా ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్లో 3 కోట్ల (30 మిలియన్ల) సబ్స్క్రైబర్ల మైలురాయిని ఆయన ఛానల్ దాటింది. దీంతో ప్రపంచంలోని ప్రస్తుత, మాజీ దేశాధినేతల్లో యూట్యూబ్లో అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన నేతగా ఆయన తన స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఘనతతో డిజిటల్ కమ్యూనికేషన్లో ప్రధాని మోడీ హవా ఏంటో అర్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇతర నేతలతో పోలిస్తే నరేంద్ర మోడీ ఆధిక్యంలో ఉన్నారు. దేశీయంగా చూసుకున్న మోడీ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.