రానున్న భారీ ప్రాజెక్టులలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నమూవీ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా. ఐతే ఈ కాంబినేషన్ కు సినిమా ప్రకటించినప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఒకవైపు ఎన్టీఆర్ మాస్ ఇమేజ్, మరోవైపు ప్రశాంత్ నీల్ అత్యద్భుతమైన టేకింగ్ ఈ భారీ అంచనాలకు కారణం. అందుకే ఈ సినిమా గురించి చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కె.జి.ఎఫ్ 1&2, సలార్ సినిమాలు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆయన సినిమాల్లో హీరో ఎలివేషన్, యాక్షన్ సన్నివేశాలు భారీ స్థాయిలో ఉంటాయి. అదే స్టైల్‌లో ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తారో అన్నఆసక్తి అభిమానులతో పాటు మూవీ లవర్స్ అందరిలో ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఈ సినిమాలో భాగం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరిపిందని, అలియా కూడా ఈ కథను వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాతే పూర్తి క్లారిటీ వస్తుంది. ఇక ఇది వరకు ఎన్టీఆర్, అలియా భట్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ లో నటించిన సంగతి తెలిసిందే.