అమెరికన్ ప్రెసిడెంట్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా తెలిపారు. ట్రంప్ నుండి ఫోన్ కాల్ అందుకున్నాను మరియు పశ్చిమ ఆసియాలోని ప్రస్తుత పరిస్థితులపై ఇరువురం ఉపయోగకరమైన అభిప్రాయాలను పంచుకున్నాము. ఉద్రిక్తతలు తగ్గాలని మరియు వీలైనంత త్వరగా శాంతి పునరుద్ధరణ జరగాలని భారత్ మద్దతు తెలుపుతోందని పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) బహిరంగంగా, సురక్షితంగా మరియు అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం ప్రపంచం మొత్తానికి అత్యవసరమని పునరుద్ఘాటించారు. శాంతి మరియు సుస్థిరత కోసం చేసే ప్రయత్నాలలో పరస్పరం టచ్‌లో ఉండాలని ఇరువురు అంగీకరించినట్లు స్పష్టం చేశారు. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరువురు ప్రపంచాధినేతలు సంభాషించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రోజుల్లో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల తీరు ఏవిధంగా ఉంటుందోనని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. యుద్ధం ముగిసి శాంతి స్థాపన జరగాలని ప్రపంచ దేశాలు ఆకాంక్షిస్తున్నాయి.