హార్మోజ్ ను దాటిన మరో భారత నౌక.. భారతీయ దౌత్యానికి దక్కిన మరో విజయం

Spread the love

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి తెలిసిందే. కాగా, రవాణాకు అత్యంత కీలక మార్గమైన హార్మోజ్ జలసంధిని దాటుకుని  మరో భారతీయ నౌక భారత్ వైపు వస్తోంది. ఈ నేపథ్యంలో ఇది భారతదేశ దౌత్యానికి లభించిన మరో విజయమని గుజరాత్ డిప్యూటీ సీఎం హార్ష్ సంఘ్వి పేర్కొన్నారు. LPG క్యారియర్ ‘గ్రీన్ శాన్వీ’ హోర్ముజ్ జలసంధిని దాటి భారతదేశానికి తన తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. దానికి ముంబై లోని ఇరాన్ కాన్సులేట్ రిప్లై ఇచ్చింది. శతాబ్దాల క్రితం మా దేశం నుండి వచ్చిన వారికి సాదరంగా ఆహ్వానించిన భారతదేశం, ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రం మన ఉమ్మడి చరిత్రలో ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉన్నాయని పేర్కొంది. ఈ శాశ్వతమైన నాగరిక బంధాన్ని పునాదిగా చేసుకుని, మన మధ్య ఉన్న స్నేహం మరియు సహకార సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. గ్రీన్ శాన్వీతో కలిపి ఇప్పటివరకు భారత జెండాలతో ఉన్న 8 ఇంధన నౌకలు హార్మోజ్ ను దాటాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *