కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Spread the love

కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పండుగలో భాగం కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. పలువురు ప్రముఖులు కూడా ఈ పోలింగ్ లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అస్సాంలోని 126 నియోజకవర్గాలు , కేరళ లోని 140 నియోజకవర్గాలు , పుదుచ్చేరి లోని 30 నియోజకవర్గాలు  మొత్తం మూడు ప్రాంతాల్లో కలిపి 296 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా..కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, బీజేపీ మధ్య ట్రై యాంగిల్ ఫైట్ జరగనుంది. ఇక పుదుచ్చేరిలో ఎన్డీయే, డీఎంకే కూటముల మధ్య ప్రధాన పోటీ జరగనుంది. ప్రజలు పోలింగ్ బూత్ లకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పటిష్టంగా చేసింది. ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *