రూ.1500 నిరుద్యోగ భృతి..ప్రకటించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

Spread the love

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళా ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 10వ  తరగతి పాసై ఉద్యోగాలు లేని వారికి నెలకు రూ.1500 నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నేటి నుంచే ఈ డబ్బులు నిరుద్యోగులఅకౌంట్స్ లో పడతాయన్నారు. యువ సాథి అనే ఈ పథకం 21-40 ఏళ్ల వారికి వర్తిస్తుందని తెలిపారు. యువ సాథి పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని తొలుత అనుకున్నట్లు పేర్కొన్నారు. అయితే మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తేదీలో మార్పులు చేసినట్లు తెలిపారు. SIR  ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర రాజధాని కోల్ కతా లో చేపట్టిన ధర్నాలో మాట్లాడుతూ ఈ పథకాన్ని ప్రకటించారు. తమ పాలనలో బెంగాల్లో నిరుద్యోగ శాతం 40 శాతం తగ్గిందని సీఎం మమతా పేర్కొన్నారు. ప్రభుత్వం దాదాపు 40లక్షల మందికి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చిందని వారిలో 10లక్షల మంది ఇప్పటికే ఉపాధి పొందుతున్నారని చెప్పారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికే ఏడాదికి రూ.10వేలు ఇస్తోందని ఇక  బెంగాల్లో పెట్టుబడు పెట్టడానికి అనేక ఐటీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *