బెంగాల్ చొరబాట్లు..తృణమూల్ కాంగ్రెస్ పై ప్రధాని మోడీ విమర్శలు 

Spread the love

పశ్చిమ బెంగాల్ లో ప్రధాని నరేంద్రమోడీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మాల్టా లో జరిగిన సభలో మాట్లాడుతూ బెంగాల్ లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో టీఎంసీ సర్కార్ విఫలమైందని అన్నారు. అభివృద్ధికి, సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే బీజేపీ ప్రభుత్వం బెంగాల్ లో రావాల్సిన అవసరం ఉందన్నారు. జెనరేషన్-జీ తో సహా దేశ ప్రజలంతా బీజేపీకి మద్దతు పలుకుతున్నారని బీహార్ లో ఎన్డీయే విజయం సాధించిందని ఇక ఇప్పుడు బెంగాల్ వంతేనని పేర్కొన్నారు.  చొరబాట్లే బెంగాల్ కు అసలైన సవాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ వీటిని అడ్డుకోవడంలో మమతా ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. చొరబాట్ల కారణంగానే బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరుగుతున్నాయని అంతేకాకుండా ఈ చొరబాట్ల ప్రభావంతో జనాభా వర్గీకరణలో కూడా మార్పు వచ్చిందని వీటిపై తృణమూల్ కాంగ్రెస్ తగిన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.40 సార్లు బెంగాల్ కు వరద సహాయ నిధులు అందించామని అయితే అసలైన లబ్దిదారులకు అవి చెందలేదని ఆక్షేపించారు. ఇక టీఎంసీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు.