కౌంటర్ అటాక్.!

Spread the love

JUPALLI KRISHNA & RAJAGOPAL REDDY: మంత్రి పదవి రాలేదనే అక్కసుతో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నట్లు విమర్శలున్నాయి. లిక్కర్ విక్రయాలపై ఆయన రూల్స్ పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందని, వ్యాపారుల్లో అయోమయం నెలకొందని రిపోర్టులో వివరించినట్లు తెలిసింది. అలాగే ఆయన కొంత కాలంగా చేస్తోన్న కామెంట్స్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉన్నట్లు విమర్శలున్నాయి. మద్యం విక్రయాలపై మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పెట్టిన షరతులపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇష్టం ఉన్నా లేకున్నా ఫాలో కావాల్సిందే అంటూ కౌంటర్ ఇచ్చారు ఆ మంత్రి..ఇంతకు ఆ మంత్రి ఎవరు…ఏం ప్రకటించారు తెలుసు కోవాలంటే లెట్స్ వాచ్ నౌ.

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కనందుకు ఆయన ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే కదా. చాలాసార్లు తన ఆగ్రహాన్ని, రేవంత్ రెడ్డి పట్ల నిరసనను బహిరంగంగానే వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడంలేదని ఆరోపించారు. సందర్భం వచ్చినప్పుడల్లా తన నిరసనను వెలిబుచ్చారు. తాజాగా తన నియోజకవర్గం మునుగోడులో తన సొంత లిక్కర్ పాలసీని, విధివిధానాలు ప్రకటించడంతో ఎక్సైజ్ శాఖ ఆయనపై సీరియస్ అయింది. రాష్ట్రమంతా ఒక పాలసీ అమలవుతుంటే, మునుగోడు నియోజకవర్గంలో రాజన్న పాలసీ ఏమిటని ఫైర్ అయ్యింది. అసలు రాజగోపాల్ రెడ్డి లిక్కర్ పాలసీ ఏమిటి? మునుగోడు నియోజకవర్గంలో మద్యం సిండికేట్ వ్యాపారులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాక్ ఇచ్చారు. తన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. “రాజన్న రూల్స్” పాటించాల్సిందేనని అన్నారు.

ఇక అంతటితె ఆగపి ఆయన వైన్ షాపుల నిర్వాహకులు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలన్నారు. ఒక మండలంలో ఆ మండలానికి చెందినవారు మాత్రమే టెండర్లు వేయాలని, ఇతర మండలాలకు చెందిన వాళ్లు అనర్హులని చెప్పారు.వైన్ షాపులు ఊరి బయట మాత్రమే ఏర్పాటు చేయాలని, ఇళ్ల మధ్యలో ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవన్నారు. వైన్స్‌కి అనుబంధంగా (సిట్టింగ్) పర్మిట్ రూమ్ ఉండవద్దన్నారు. ముఖ్యంగా బెల్ట్ షాపులకు మద్యం అమ్మవద్దని, లాటరీ విధానంలో వైన్స్ షాపులు దక్కించుకున్న ఓనర్లు సిండికేట్ కాకూడదన్నారు.

మునుగోడు రూల్స్‌కి రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదన్నారు. ఈ రూల్స్ పాటించని వారు టెండర్లు వేయవద్దు, నిబంధనలు అతిక్రమించి ఇబ్బందులు పడవద్దని సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డి ఫాలోవర్స్ మెసేజ్‌లు వైరల్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి రూల్స్‌పై ఎక్సైజ్ శాఖ సీరియస్ అయింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రాష్ట్రం మొత్తం ఒక పాలసీ ఉన్నప్పుడు మునుగోడులో మరో పాలసీ ఎలా ఉంటుందని ఆగ్రహించింది. బహుశా ఇది కూడా రేవంత్ రెడ్డిపై ఆగ్రహంలో భాగమే కావొచ్చు.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మద్యం విక్రయాలపై సొంతంగా విధించిన షరతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తన నియోజకవర్గ పరిధిలో మద్యం దుకాణాలు కేవలం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే విక్రయాలు జరపాలని, అలాగే పర్మిట్ రూమ్స్‌కు ఎలాంటి అనుమతి ఇవ్వబోమని రాజగోపాల్‌రెడ్డి ఇటీవల బహిరంగంగా ప్రకటించారు. ఎమ్మెల్యే విధించిన ఈ ఆంక్షలు స్థానిక మద్యం వ్యాపారులలో తీవ్ర అయోమయాన్ని, భయాన్ని సృష్టించాయి. ఈ కారణంగానే కొందరు వ్యాపారులు కొత్త లైసెన్స్‌ల కోసం టెండర్లు వేయడానికి కూడా వెనుకంజ వేశారు. ఇక పరిస్థితులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పరిస్థితిని గమనించిన ఎక్సైజ్ శాఖ అధికారులు మునుగోడులో నెలకొన్న ఈ ప్రత్యేక పరిస్థితులపై ప్రభుత్వంలోని కీలక నేతలకు నివేదిక అందించారు. సదరు వ్యాపారుల అభ్యంతరాలను విన్న ముఖ్య నేతలు, రాష్ట్రం మొత్తం ఒకే మద్యం విధానం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ‘ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు సొంత రూల్స్ పెడితే కుదరదు, రాష్ట్రంలో ఒక్క అంగుళం కూడా వేరే పాలసీ ఉండదు. అనవసరంగా భయపడకుండా షాపులకు దరఖాస్తు చేసుకోండి. డ్రా ద్వారా లైసెన్స్‌ పొందిన వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వం చూసుకుంటుంది’ అని వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.

ఈ అంశంపై పలువురు వ్యాపారులు నేరుగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లారు. ‘రాష్ట్రం మొత్తం ఒకటే మద్యం పాలసీ ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి తెలిపారు. నియోజకవర్గానికి ఒక్కో తీరుగా రూల్స్ ఉండవు. ఒక్కో లీడర్‌కు ఒక్కో ఆలోచన ఉండొచ్చు, కానీ చట్టం అందుకు ఒప్పుకోదు. ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ తప్పకుండా చట్టాన్ని, ప్రభుత్వ పాలసీని ఫాలో కావాల్సిందే’ అని తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఒక్కో లీడర్‌కు ఒక్కో ఆలోచన ఉండొచ్చు. కానీ చట్టం అందుకు ఒప్పుకోదు. ఇష్టం ఉన్నా లేకున్నా అందరూ ఫాలో కావాల్సిందే’ అని కామెంట్ చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. JUPALLI KRISHNA & RAJAGOPAL REDDY.

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఇలా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా, పాలసీకి విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ అక్కసు ఉందని పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్ర పదవి దక్కకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శలు ఉన్నాయి. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని కష్టపడిన తనను విస్మరించడం సరికాదని రాజగోపాల్‌రెడ్డి ఇప్పటికే బహిరంగంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా కొన్ని సందర్భాలలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుపై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో, రాజగోపాల్‌రెడ్డి వ్యవహార శైలి, ఆయన చేస్తోన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పూర్తి స్థాయి నివేదిక పంపినట్లుగా పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ జరుగుతోంది.