చరిత్ర సృష్టించిన బీజేపీ.. తూర్పు భారతంలో కమల వికాసం!

Spread the love

ఐదు రాష్ట్రాల ఎన్నికల పోరు ముగిసింది. ఫలితాలు తేలిపోయాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది, మమతా బెనర్జీ కంచు  కోటను బీజేపీ బద్ధలు కొట్టింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బీజేపీకి ఈ విజయం ఒక చారిత్రాత్మక విజయంగా  నిలిచింది. బెంగాల్‌ రాజకీయ పోరు ఎప్పుడూ ఆసక్తికరమే. సందేశ్‌ఖాలీ ఘటన మహిళా ఓటర్ల మనసుల్లో బలమైన ముద్ర వేయడం బీజేపీకి ప్రధాన అస్త్రంగా మారింది. కేంద్ర పథకాలను గడప గడపకూ తీసుకెళ్లడం ద్వారా కమలనాథులు తృణమూల్ పునాదులు  కదిలించగలిగారు. మరోవైపు అస్సాంలో హిమంత బిశ్వ శర్మ తన అభివృద్ధి మంత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. పటిష్టమైన నాయకత్వాన్ని నమ్మి అస్సాం ప్రజలు మరోసారి బీజేపీ నాయకత్వం వైపే మొగ్గు చూపారు. మౌలిక సదుపాయాల కల్పన,  రాష్ట్ర గుర్తింపును కాపాడటంలో హిమంత చూపిన చొరవ అద్భుత ఫలితాలను ఇచ్చింది. విపక్ష కూటమి ఎంత ప్రయత్నించినా హిమంత వ్యూహాల ముందునిలబడలేకపోయింది. మొత్తానికి తూర్పు భారత్ లో బీజేపీ తన పట్టును మరింత బిగించిందని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా మొదటి సారి ఓటు వేసిన యువతరం కూడా బీజేపీ వైపే మొగ్గు చూపిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఏ రకంగా చూసుకున్న ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి చారిత్రాత్మక విజయాలనే చెప్పాలి. ఒక చోట హ్యాట్రిక్ ఇక బెంగాల్ వంటి కీలక రాష్ట్రంలో బీజేపీ తన భావజాలాన్ని బలపరుచుకుంటూ వస్తూ ఈసారి మాత్రం అధికారాన్ని కైవసం చేసుకుని సత్తా చాటింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *