ప్రధాని మోడీతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్ భేటీ 

Spread the love

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ భారత లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. నేడు ముంబయిలోని లోకభవన్ లో  ఇరువురు నేతలు భేటీ జరిగింది.ఈ సందర్భంగా మెక్రాన్ ను  ప్రధాని మోడీ  సాదరంగా స్వాగతించారు. ఈ భేటీకి ముందు తాజ్ హోటల్ వద్ద 26/11 ముంబయి పేలుళ్ల మృతులకు మెక్రాన్, ఆయన సతీమణి బ్రిగిట్టి నివాళులు అర్పించారు. మూడురోజుల పర్యటనలో భాగంగా గత రాత్రి మెక్రాన్ ముంబయికి చేరుకున్నారు.  రఫేల్ ఫైటర్ జెట్ ఒప్పందం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో సహకారం ప్రధాన ఎజెండాలుగా అధ్యక్షుడి పర్యటన సాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో  జరిగే ‘ఏఐ ఇంపాక్ట్ సమిట్’లో 19న మెక్రాన్ పాల్గొంటారు. భారత్ కు  114 రఫేల్ యుద్ధవిమానాల సరఫరాకు మెక్రాన్ పర్యటన సమయంలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం విలువ రూ.3.25 లక్షల కోట్లు. ఇది ఖరారైతే దేశ చరిత్రలో అతిపెద్ద రక్షణ ఒప్పందంగా నిలుస్తుంది.