సవాళ్ల మధ్య కూడా భారత్ దూసుకెళ్తోంది:ప్రధాని మోడీ

Spread the love

నేడు ప్రపంచం అనేక వర్గాలుగా విడిపోయినప్పటికీ, సవాళ్ల మధ్య  కూడా భారత్ తన బలం, అభివృద్ధి మరియు సంకల్పంతో ముందుకు సాగుతూనే ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. .2004 నుండి 2010 మధ్య కాలంలో, పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినప్పుడు, కాంగ్రెస్ దేశ శ్రేయస్సు కంటే తన అధికారం గురించే ఎక్కువ ఆందోళన చెందిందని చురకలంటించారు.  కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను సరిదిద్దడానికి తమ  ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నారు. సంఘర్షణల వల్ల ఏర్పడిన ప్రపంచ స్థాయి ఉద్రిక్తతల మధ్య నడుమ కూడా, భారత్  అభివృద్ధికి అగ్ర ప్రాధాన్యతనిస్తూనే ఉందని స్పష్టం చేశారు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు. ఆ తేడా ప్రస్పుటంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. గతంలో కేవలం ప్రణాళికలు మాత్రమే రూపొందించేవారని అయితే నేడు మాత్రం ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయని అన్నారు. గతంలో అభివృద్ధి నెమ్మదిగా సాగేదని నేడు భారతదేశం వేగంగా ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. భారతదేశం ప్రతి సవాలునూ విజయంగా మలచుకోవడం అనేది కాంగ్రెస్ దురదృష్టమైతే, దేశానికి మాత్రం అది గొప్ప అదృష్టమన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *