ట్రంప్ కు షాక్ ఇచ్చిన భారత్..!

Spread the love

India Refuses F-35 Fighter Jet Deal: తన టారిఫ్ లతో భయపెట్టాలని చూసిన ట్రంప్ కు భారత్ భారీ షాక్ ఇచ్చింది. అమెరికా నుంచి కొనుగోలు చేయాలని అనుకుంటున్న అత్యాధునిక F-35 యుద్ధ విమానాలను ఒప్పందంలో విషయంలో భారత్ వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం అమెరికా రక్షణ పరిశ్రమకు ఆర్థికంగా పెద్ద దెబ్బే అంటున్నారు. అసలు భారత్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? దీనిపై అమెరికా రియాక్షన్ ఎలా ఉంది…? మరి F-35లు మాకొద్దన్న భారత్.. ప్రత్యామ్నాయంగా ఏం చేస్తోంది..?

భారత వైమానిక దళం, రక్షణ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు అమెరికాను ఇరుకునపడేసింది. భారత్ ను బ్లాక్ మెయిల్ చేయాలని చూసిన ట్రంప్ కు మనమే పెద్ద షాక్ ఇచ్చాం. అమెరికా నుంచి F-35 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని భారత్ నిర్ణయించుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఉత్పత్తులపై 25% ఎగుమతి సుంకాలు విధించడం, వాణిజ్య చర్చల్లో సాంకేతిక బదిలీపై అమెరికా సుముఖత చూపకపోవడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. ఈ సుంకాల వల్ల F-35 విమానాల ధర, డెలివరీ ఖర్చులు పెరగడంతో భారత్ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంది. ఈ నిర్ణయాన్ని భారత్ అమెరికాకు అధికారికంగా తెలియజేసింది.

భారత్ నిర్ణయం వల్ల అమెరికాకు ఆర్థిక, రాజకీయంగా ఎంత నష్టం..?
F-35 యుద్ధ విమానం అమెరికా డిఫెన్స్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్. లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసే ఈ విమానాలను బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా వంటి సన్నిహిత మిత్రదేశాలకు మాత్రమే అమెరికా అమ్ముతోంది. భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల అమెరికాకు తీరని నష్టమంటున్నారు. భారత్ లాంటి పెద్ద మార్కెట్‌ను కోల్పోవడం వల్ల లాక్‌హీడ్ మార్టిన్, దాని అనుబంధం కంపెనీలకు వందల కోట్ల డాలర్ల నష్టం జరుగుతుంది. అలాగే ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారత్-అమెరికా మిత్రత్వం కీలకం. F-35 ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల ఈ స్నేహానికి ఎదురుదెబ్బ తగిలినట్టే. చైనా లాంటి దేశాలు దీనిని వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవచ్చు.

ఈ మధ్ కాలంలో భారత్ తన రక్షణ అవసరాల కోసం స్వదేశీ ప్రాజెక్టులపై దృష్టి సారించింది. తేజస్ Mk1A, అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, సుఖోయ్-30 వంటి ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. అమెరికా సాంకేతికత బదిలీ చేయకపోవడం, అధిక సుంకాలు విధించడం వల్ల భారత్ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. సాంకేతికత బదిలీ, సులువైన డెలివరీ సిస్టమ్, ధర నియంత్రణ లేని ఒప్పందాలను ఇకపై ఆమోదించమని కూడా రక్షణ శాఖ స్పష్టం చేసింది.

అమెరికా ఇప్పటివరకు F-35 విమానాలను నాటో మిత్రదేశాలు, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు మాత్రమే అమ్మింది. భారత్ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రక్షణ మార్కెట్‌ను కోల్పోవడం అమెరికా రక్షణ పరిశ్రమకు పెద్ద ఎదురుదెబ్బ. అమెరికా 25% సుంకాల నిర్ణయం భారత్‌తో వాణిజ్య సంబంధాలను దెబ్బతీసిందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ సుంకాలు రక్షణ ఒప్పందాలతో పాటు, భారత్ నుంచి వస్తున్న ఇతర ఎగుమతులపై కూడా ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. India Refuses F-35 Fighter Jet Deal.

F-35 ఒప్పందం రద్దు తర్వాత భారత్ ఇతర డిఫెన్స్ ఒప్పందాలపై దృష్టి పెట్టింది. ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానాలు, రష్యాతో సుఖోయ్-30 ఒప్పందాలు, స్వదేశీ తేజస్, అమ్కా ప్రాజెక్టులు భారత వైమానిక దళాన్ని బలోపేతం చేస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత డెలివరీ సమస్యలను ఎదుర్కొన్న భారత్, స్వదేశీ రక్షణ ఉత్పత్తులపై దృష్టి పెట్టడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధిస్తోంది. ఈ నిర్ణయం భారత్ రక్షణ స్వావలంబనాన్ని మరింత బలపరుస్తుంది.

భారత్ F-35 రద్దు నిర్ణయం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో జియోపొలిటికల్ సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. పెరుగుతున్న చైనా సైనిక బలాన్ని ఎదుర్కొనేందుకు భారత్-అమెరికా రక్షణ సహకారం కీలకం. ఈ ఒప్పందం రద్దు వల్ల భారత్ ఇతర దేశాలతో రక్షణ ఒప్పందాలను మరింత బలోపేతం చేసుకోవచ్చు. అమెరికా తన వాణిజ్య విధానాలను సమీక్షించకపోతే, భారత్ లాంటి కీలక మిత్రదేశాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Also Read: https://mega9tv.com/national/these-are-the-jobs-that-will-soon-disappear-due-to-ai-key-points-in-microsoft-survey/