AI వల్ల త్వరలో పోయే ఉద్యోగాలు ఇవే…!!

Spread the love

AI Recent Microsoft Survey: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం ఇప్పుడు ఉద్యోగ మార్కెట్‌ను సమూలంగా మార్చేస్తోంది. మైక్రోసాఫ్ట్ తాజా అధ్యయనం ప్రకారం, రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో వేల సంఖ్యలో వైట్ కలర్ ఉద్యోగాలు AI ఆటోమేషన్ వల్ల రూపాంతరం చెందనున్నాయి. ఈ నివేదిక ఉద్యోగస్తులు, విద్యార్థులు, కార్పొరేట్ సంస్థలలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది. ఏ రంగాల్లో ఎక్కువగా ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది? మైక్రోసాఫ్ట్ గుర్తించిన 40 వైట్ కలర్ ఉద్యోగాలు ఏమిటి? AIని అవకాశంగా ఎలా మలచుకోవచ్చు?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే పలు రంగాల్లో ఉద్యోగాలను తగ్గిస్తూ, విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. కస్టమర్ సపోర్ట్ రంగంలో చాట్‌బాట్‌లు, వర్చువల్ అసిస్టెంట్‌లు మనుషులు ఉద్యోగుల స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. కాంటాక్ట్ సెంటర్లు, బ్యాంకింగ్ ప్రాసెసింగ్ కార్యాలయాల్లో AI ఆధారిత సాఫ్ట్‌వేర్‌లు సాధారణ పనులను వాటికవే నిర్వహిస్తున్నాయి. మీడియా, జర్నలిజం రంగంలో AI ఆర్టికల్ జనరేటర్లు, ఆటోమేటెడ్ రిపోర్టింగ్ టూల్స్ వల్ల జర్నలిస్టులు, కంటెంట్ రైటర్ల ఉద్యోగాలు ముప్పులో పడ్డాయి. డేటా అనలిసిస్, మార్కెట్ రీసెర్చ్, డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో రిపోర్ట్ జనరేషన్, కన్వర్షన్ ట్రాకింగ్ వంటి పనులు పూర్తిగా AIకి మారిపోతున్నాయి. అకౌంటింగ్, క్లెరికల్ వర్క్, హెచ్‌ఆర్ రిక్రూట్‌మెంట్ వంటి సాంప్రదాయ పనులు కూడా AI సాఫ్ట్‌వేర్‌ల ద్వారా అటోమేషన్ అవుతున్నాయి. ఈ మార్పులు ఉద్యోగులకు కొత్త సవాళ్లను తెస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్ పరిశోధనలో కొన్ని విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు లక్షలకు పైగా AI ఇంటరాక్షన్‌లను విశ్లేషించి, కోపైలట్ వంటి AI టూల్స్ ఆధారంగా 40 వైట్ కలర్ ఉద్యోగాలు అత్యంత ప్రమాదంలో ఉన్నవిగా గుర్తించింది. ఈ జాబితాలో ఎక్కువగా డిగ్రీ కలిగిన నాలెడ్జ్ వర్కర్స్, కంప్యూటర్ ఆధారిత కార్యాలయ ఉద్యోగులు, డిజిటల్ కెరీర్‌లలో ఉన్నవారు ఉన్నారు. సీఎన్‌ఎన్ టూల్ ప్రోగ్రామర్లు, రైటర్లు, జర్నలిస్టులు, బ్రోకరేజ్ క్లెర్కులు, ఇంటర్‌ప్రెటర్స్, ప్రూఫ్‌రీడర్లు, టెక్నికల్ రైటర్లు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, అడ్వర్టైజింగ్ ఏజెంట్లు, లైబ్రరీ సైన్స్ టీచర్లు, ఆర్కైవిస్టులు, వెబ్ డెవలపర్లు, మేనేజ్‌మెంట్ అనలిస్టులు, పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్లు, టెలిఫోన్ ఆపరేటర్లు, ఎడిటర్లు వంటి విభిన్న రంగాల్లోని ఉద్యోగాలు ఈ జాబితాలో చేరాయి. ఈ ఉద్యోగాలు త్వరలో పూర్తిగా AI ఆధారిత ఆటోమేషన్‌కు మారే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. దీని ద్వారా వీరు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది.

మైక్రోసాఫ్ట్ జాబితాలో చేరిన ఉద్యోగాలు ఎక్కువగా నాలెడ్జ్ వర్కర్స్‌కు సంబంధించినవి, అంటే బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీలు కలిగినవారు ఈ లిస్టులో ఉన్నారు. స్పెషలైజ్డ్ టెక్నికల్ లేదా హ్యూమన్ ఇంటర్‌ఫేస్ పనుల్లో నిమగ్నమైనవారు… హిస్టోరియన్స్, రైటర్లు, జర్నలిస్టులు, టెక్నికల్ రైటర్లు, ఎడిటర్లు, ప్రూఫ్‌రీడర్లు, మేనేజ్‌మెంట్ అనలిస్టులు, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, పబ్లిక్ రిలేషన్స్ నిపుణులు, డేటా సైంటిస్టులు వంటి వారు ఈ ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రంగాల్లో ఆటోమేషన్ వేగంగా పెరుగుతున్నందున, డిగ్రీలు మాత్రమే సరిపోవు, నిరంతరం కొత్త స్కిల్స్‌తో అప్‌డేట్ కావాలని మైక్రోసాఫ్ట్ సూచిస్తోంది. అదే విధంగా, ఇంటర్‌ప్రెటర్స్, ట్రాన్స్‌లేటర్లు వంటి భాషా సంబంధిత ఉద్యోగాలు AI ట్రాన్స్‌లేషన్ టూల్స్ అభివృద్ధితో ప్రమాదంలో పడ్డాయి. ఈ రంగాల్లో పనిచేసే వారు తమ స్కిల్స్‌ను AIకి అనుగుణంగా మార్చుకోవడం అత్యవసరం.

AIని అవకాశంగా మలచుకోవడం ఎలా?
AI వల్ల ఉద్యోగాలు పోతాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ, దానిని ఓ బూచిగా చూడకుండా అవకాశంగా మలచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మూసపద్దతి పనులపై ఆధారపడిన ఉద్యోగులు AI టూల్స్‌ను ఉపయోగించడం నేర్చుకోవాలి. బేసిక్ కోడింగ్, డేటా అనలిటిక్స్, AI ఆధారిత సాఫ్ట్‌వేర్‌లలో నైపుణ్యం పెంచుకోవడం భవిష్యత్ ఉద్యోగాలకు సన్నద్ధమవడానికి సహాయపడుతుంది. రచయితలు, జర్నలిస్టులు AI సహాయంతో లోతైన స్టోరీటెల్లింగ్, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ వంటి మానవీయ సృజనాత్మకతపై దృష్టి సారించాలి. కళాశాల విద్యార్థులు, ప్రొఫెషనల్స్ గ్రాఫిక్ డిజైన్, డిజిటల్ ఎడిటింగ్, యూజర్ ఇంటర్‌ఫేస్ డిజైన్, AI టూల్స్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. కంపెనీలు కూడా AIని ఉపయోగించి కొత్త సేవలు, మార్కెట్ వ్యూహాలను రూపొందించడం ద్వారా కొత్త అవకాశాలను సృష్టించవచ్చు. AIని పూర్తిగా రీప్లేస్‌మెంట్‌గా కాకుండా సహాయక సాధనంగా ఉపయోగించుకోవడం కీలకం. AI Recent Microsoft Survey.

ఎంత AI ఆధారిత ఆటోమేషన్‌ వచ్చినా.. కొన్ని మనులు మానవులు చేసినట్టు అవి చేయలేవు. సానుభూతి, సృజనాత్మకత, క్లిష్టమైన సమస్యల పరిష్కారం వంటివి AIకి సాధ్యం కాదు. AI సహాయాన్ని తీసుకుని.. సొంత తెలివితేటలు వాడుకునే వారు ముందంజలో ఉంటారు. AIని అభివృద్ధి సాధనంగా ఉపయోగించుకుంటే, ఉద్యోగం పోతుందనే భయం లేకుండా కొత్త అవకాశాలను సృష్టించుకోవచ్చు. AIతో కలిసి పనిచేసే హైబ్రిడ్ రోల్స్, కొత్త టెక్నాలజీ ఆధారంగా సేవలు భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌లో ప్రముఖంగా మారతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

AI ఉద్యోగ అవకాశాలను మార్చేస్తున్నప్పటికీ, ఇది కొత్త అవకాశాలను కూడా తెరతీస్తోంది. AI టూల్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించే నైపుణ్యాలు, డేటా అనలిటిక్స్, కోడింగ్, సైబర్ సెక్యూరిటీ, AI డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. విద్యాసంస్థలు, కంపెనీలు ఈ కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు శిక్షణా కార్యక్రమాలను పెంచుతున్నాయి. ఉద్యోగస్తులు, విద్యార్థులు నిరంతర అభ్యాసం, స్కిల్ అప్‌గ్రేడ్ ద్వారా AI యుగంలో ముందంజలో ఉండాలని మైక్రోసాఫ్ట్ సూచిస్తోంది. ఈ మార్పులను సవాలుగా కాకుండా అవకాశంగా స్వీకరించడం ద్వారా భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌లో విజయవంతం కావచ్చు.

Also Read: https://mega9tv.com/national/why-is-america-jealous-of-india-what-should-be-done-to-teach-trump-a-lesson/