తెలంగాణ సీఎం రేవంత్ కుటుంబ సభ్యులను కలిసిన రష్మిక

Spread the love

తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి కుటుంబాన్ని ప్రముఖ నటి  రష్మిక కలిశారు. ఇటీవల ఆమె విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా,  హైదరాబాద్ లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్ కు  రావాల్సిందిగా సీఎం రేవంత్ కుటుంబాన్ని ఆమె  ఆహ్వానించారు. రష్మికను సీఎం రేవంత్ కుటుంబం సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. ఇక  మార్చి 6న  అల్లు శిరీష్ త్వరలో పెళ్లి చేసుకోనున్న సందర్భంగా కాబోయే పెళ్లి కొడుకు అల్లు శిరీష్ ను  నూతన వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, తమ వివాహ రిసెప్షన్ కు  రావాల్సిందిగా అల్లు అరవింద్, అల్లు అర్జున్ సహా కుటుంబ సభ్యులను స్వయంగా ఆహ్వానించారు.పెళ్లి తర్వాత రష్మిక-విజయ్ లకు  అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *