
Brahmos 2.0 Astra Missile: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత శక్తి ప్రపంచానికి తెలుసు. ఇదే సమయంలో మిత్రులు ఎవరో.. శత్రువులు ఎవరో భారత్‌కు అర్థమైంది. మన చుట్టూనే శత్రువులు ఉన్నారని గుర్తించిన భారత్.. ఆయుధాల తయారీపై ఫోకస్ పెట్టింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సరికొత్త టెక్నాలజీతో ఆయుధాలు రూపొందిస్తోంది. ఆపరేషన్ సిందూర్‌లో కీలకపాత్ర పోసించిన బ్రహ్మోస్ క్షిపణిని మరింత శక్తివంతంగా మారుతోంది. శబ్ద వేగాన్ని మించిపోయే బలమైన సూపర్‌సోనిక్ మిసైల్ ఇది. శత్రు శిబిరాలను క్షణాల్లో ధ్వంసం చేసే చేయడం దీన్ని ప్రత్యేకత. ఇప్పుడు భారత రక్షణ శాస్త్రవేత్తలు దాని దూరప్రయాణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే దిశలో ముందుకెళ్తున్నారు.
ఖబడ్దార్ పాకిస్తాన్. మీ భూభాగంలోని ప్రతి అంగుళం మా బ్రహ్మోస్ పరిధిలో ఉంది. తోక జాడిస్తే తోలు తీస్తాం. అంటూ మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ దాయాదిదికి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అంతటి శక్తివంతమైన బ్రహ్మోస్, మరో రెండేళ్లలో అప్‌గ్రేడ్ వెర్షన్ రాబోతోంది. మామూలుగా వెర్షన్‌కు పాకిస్తాన్‌కు చెమటలు పట్టించిన బ్రహ్మోస్ అప్‌గ్రేడ్ వెర్షన్ 2.O సిద్ధమైతే శత్రుదేశాలకు దిమ్మ తిరిగి బొమ్మ కనడపటం ఖాయమంటున్నారు నిపుణులు.
ఆధునిక యుద్ధ కాలంలో సైనికులు నేరుగా తలపడటం అరుదుగా మారింది. శత్రువులను చాలా దూరం నుంచే గుర్తించి గగనతలం నుంచి శత్రుస్థావరాలపై దాడులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు భారత్ అదే పనిలో నిమగ్నమైంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు వణుకుపుట్టించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని సామర్థ్యాన్ని పెంచే పనిలో భారత రక్షణ రంగ సంస్థలు పనిచేస్తున్నాయి. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే అస్త్ర క్షిపణి కూడా మెరుగులు దిద్దుకుంటోంది.
భారత సైన్యంలోకి త్వరలో 800 కిలోమీటర్ల రేంజ్ బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులు చేరబోతున్నాయి. ప్రస్తుత బ్రహ్మోస్ క్షిపణి పరిధి 450 కి.మీ. ఇది శబ్దవేగం కంటే రెండు రెట్లు వేగంతోలక్ష్యాలను చేదించగలదు. కొత్త వెర్షన్‌లో ఇంతకుమించిన టెక్నాలజీతో బ్రహ్మోస్ సిద్ధం కానుంది . ర్యామ్‌జెట్ ఇంజిన్, అధునాతన నావిగేషన్ వ్యవస్థలు ఉంటాయి. ప్రస్తుతం క్షిపణి పరీక్షలు జరుగుతున్నాయి. 2027 నాటికి పూర్తిస్థాయిలో సేవలోకి రానుంది. “కొత్త బ్రహ్మోస్ కేవలం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తోనే పాత లాంచర్లలో వినియోగించవచ్చంటున్నారు నిపుణులు.
ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్థాన్‌పై దాడులకు బ్రహ్మోస్ క్షిపణులు కీలకపాత్ర పోషించాయి. అత్యంత కచ్చితత్వంతో శత్రుస్థావరాలపై దాడులు చేసిన బ్రహ్మోస్ క్షిపణులను భారత్ ఇప్పుడు అప్‌గ్రేడ్ చేసే పనిలో పడింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ సైన్యానికి నిద్రలేని రాత్రులను మిగిల్చిన ఈ క్షిపణి మరింతగా పదునుదేలుతోంది. దాని సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే పనిలో భారత రక్షణ రంగ సంస్థలు నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం ఈ సూపర్ సోనిక్ క్షిపణి పరిధి 450 కిలోమీటర్లుగా ఉండగా దానిని 800 కిలోమీటర్లకు పెంచేలా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మోస్ క్షిపణి శబ్ద వేగం కంటే 2.8 రెట్ల అధిక స్పీడుతో దూసుకుపోయి క్షణాల్లో ప్రత్యర్థులపై దాడులు చేయగలదు. సుఖోయ్-30 MKI యుద్ధ విమానం దీనిని ప్రయోగించగలదు. ఇప్పుడు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించేందుకు వీలుగా బ్రహ్మోస్ క్షిపణిని తీర్చిదిద్దుతున్నారు. 2027 నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అభివృద్ధి దాదాపు పూర్తైపోయింది.
సముద్ర ఆధారిత బ్రహ్మోస్ వెర్షన్‌తో మొదట ఈ సాంకేతిక రూపాంతరం మొదలుకానుంది. నౌకాదళానికి ఉపయోగించే ఫైర్ కంట్రోల్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆధారంగా రేంజ్ పెంపు సాధ్యమవుతుందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్మీ వేరియంట్‌ను తరువాత, చివరగా వాయుసేనకు అనువైన మోడల్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇదే సమయానికి ఆయుధ మోడ్యూల్‌లో పెద్దగా మార్పులు చేయకుండా సామర్థ్యం పెంపు సాధనమే ప్రధాన లక్ష్యంగా ఉంది.
అప్‌గ్రేడెడ్ వెర్షన్‌కు సంబంధించి ఇంటర్నల్ నేవిగేషన్ వ్యవస్థ-ఎక్స్‌టర్నల్ గ్లోబల్ నేవిగేషన్ వ్యవస్థ కాంబినేషన్ వంటి కొన్ని పరీక్షలు జరగాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి విజయవంతమైతే నేరుగా 800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను బ్రహ్మోస్ ఛేదించగలదు. నౌకాదళం వినియోగించే బ్రహ్మోస్ వేరియంట్‌లో సాఫ్ట్‌వేర్, ఫైర్ కంట్రోల్ వ్యవస్థల్లో మార్పులు చేసి రేంజిని పెంచే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. క్షిపణి డిజైన్, లాంచర్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఆర్మీ వినియోగించే వేరింయట్‌ను చివరిగా వాయుసేన వాడే వేరియంట్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నారు.
భారత్ వద్ద ఉన్న అస్త్ర మార్క్ బియాండ్ విజువల్ రేంజి క్షిపణలను అప్‌గ్రేడ్ చేసే పనిలో భారత రక్షణ రంగ సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతం 160 కిలోమీటర్ల రేంజ్ ఉన్న అస్త్ర మార్క్-2 క్షిపణి సామర్థ్యాన్ని 200 కిలోమీటర్లకుపైగా పెంచే పనిలో నిమగ్నమయ్యాయి. అస్త్ర మార్క్-1 రేంజిని 100 కిలోమీటర్లకు పైగా పొడిగించనున్నాయి. మరో ఆరు నెలల్లో అస్త్ర మార్క్-2 ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. వాయుసేన 700 క్షిపణులను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు చేస్తుండగా వీటిని సుఖోయ్-30 MKI, తేజస్‌లో అమర్చనున్నారు. ఇక ఘన ఇంధనం రామ్ జెట్ ఇంజిన్‌తో పనిచేసే అస్త్ర మార్క్-3 అభివృద్ధి జోరుగా జరుగుతోంది. దీని రేంజిని 350 కిలోమీటర్లుగా అంచనా వేస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ నుంచి బీవీఆర్ క్షిపణుల దిగుమతి తగ్గిపోతుంది.
ఇండో–రష్యన్ జాయింట్ వెంచర్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇప్పటివరకు రూ. 58,000 కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. గత సంవత్సరం రక్షణ మంత్రిత్వ శాఖ రూ. 19,519 కోట్లతో 220 బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు ఒప్పందం చేసింది. ప్రస్తుతం నేవీకి చెందిన సుమారు 20 యుద్ధ నౌకలు బ్రహ్మోస్ లాంచ్ వ్యవస్థలతో అమర్చబడ్డాయి. ఆపరేషన్ సిందూర్ విజయవంతం తరువాత, వాయుసేన కోసం మరో 110 ఎయిర్–లాంచ్‌డ్ బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలుకు రూ. 10,800 కోట్ల ప్రాథమిక ఆమోదం కూడా లభించింది. సో..భారత్ స్వదేశీ రక్షణ సాంకేతికతను వేగంగా అభివృద్ధి చేస్తోంది. బ్రహ్మోస్ , ఆస్ట్రా ప్రాజెక్టులు దేశ రక్షణ రంగంలో గేమ్‌చేంజర్ అంటున్నారు నిపుణులు Brahmos 2.0 Astra Missile.
ఈ కొత్త పరిణామాలతో భారత్‌కి విదేశీ దిగుమతులపై ఆధారపడే అవసరం తగ్గనుంది. రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌ల వంటి దేశాల నుంచి బీవీఆర్ ఆయుధాల దిగుమతి తగ్గి, స్వదేశీ అభివృద్ధికి బలం చేకూరుతుంది. దీని వల్ల భారత్ ‘రక్షణాత్మక స్వయం సమృద్ధి‘ దిశగా మరొక అడుగు ముందుకేసినట్లవుతుంది.