బీజేపీపై ఆప్ నేషనల్ కన్వీనర్ కేజ్రీవాల్ విమర్శలు

Spread the love

అధికార బీజేపీపై ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. బీజేపీకి  ‘కౌంట్ డౌన్’ మొదలైందంటూ మండిపడ్డారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. లిక్కర్ కేసులో తనని అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు.  ఆ కేసులో కేజ్రీవాల్ ను  నిర్దోషిగా ప్రకటిస్తూ ఇటీవల కోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చిన విషయాన్ని ఆయన వివరించారు. నేను నీతిపరుడనని ఈ తీర్పుతో నిరూపితమైంది. నేను ఎప్పుడూ అత్యంత నిజాయితీపరుడిని నేను అవినీతికి పాల్పడ్డానని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.12 ఏళ్ల బీజేపీ పాలనపై విమర్శలు గుప్పించారు. 2011లో జరిగిన జంతర్ మంతర్ సభ కాంగ్రెస్ ను అధికారంలో నుండి దించింది. ఇప్పుడు జరుగుతున్న సభతో తొందర్లోనే బీజేపీకి  అదే గతి పట్టేందుకు కౌంట్ డౌన్ మొదలైందని కేజీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసిన తర్వాత జరిగిన మొదటి పెద్ద సభ ఇది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా, ఆతిశీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *