పశ్చిమ బెంగాల్ లో నేడు రెండో విడత పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ భారీ విజయం సాదించబోతున్నట్లు తెలిపారు. మూడింట రెండొంతుల మెజారిటీతో గెలిచి సత్తా చాటుతుందన్నారు. తమ ప్రత్యర్థులకు అన్ని స్థానాల్లో పరాభవం తప్పదని అన్నారు. ఆమె అభిమానులకు, కార్యకర్తలకు విక్టరీ సింబల్ చూపిస్తూఅభివాదం చేశారు. ఇక సీఎం మమతా బెనర్జీ సెంట్రల్ ఫోర్సెస్, పరిశీలకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది, కేంద్ర పరిశీలకులు మహిళలు సహా అందరినీ టార్గెట్ గా చేసుకుంటున్నారని, అమాయకులను కొడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎంతోమంది టీఎంసీ మద్దతుదారులను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఇక బెంగాల్ లో ఈరోజు పోలింగ్ భారీ స్థాయిలో 89 శాతానికి పైగా నమోదైంది. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.