ఈ సీజన్ లో మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ టార్గెట్ ను ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది. తాజాగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు చేసింది. రికెల్టన్ 123 నాటౌట్ (55; 10×4, 8×6) అద్భుత సెంచరీతో చెలరేగాడు. విల్ జాక్స్ 46 (22; 5×4, 3×6), హార్దిక్ పాండ్య 31 (15; 2×4,2×6), నమన్ ధీర్ (22) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింజె 2 వికెట్లు, ఇషాన్ మలింగా 1 వికెట్, సాకిబ్ హుస్సేన్ 1 వికెట్, నితీష్ కుమార్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 76 (30; 4×4, 8×6), అభిషేక్ శర్మ 45 (24; 4×4, 3×6) మొదటి వికెట్ కు 129 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఇషాన్ కిషన్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అయితే క్లాసీన్ 65 నాటౌట్ (30; 7×4, 4×6) మాత్రం నితీష్ కుమార్ రెడ్డి 21(17; 3×4), సలీల్ అరోరా 30 నాటౌట్ (10; 2×4, 3×6)లతో కలిసి హైదరాబాద్ ను విజయతీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్లలో ఘజన్ ఫర్ కు 2 వికెట్లు దక్కగా..హార్దిక్ పాండ్య, ట్రెంట్ బౌల్ట్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ భారీ విజయంతో పాయింట్ల పట్టికలో ఆడిన 9 మ్యాచ్ లలో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి మూడో స్థానంలో కొనసాగుతోంది.