కేంద్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం లోక్ సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50 శాతం మేర పెరగనున్నాయి. ప్రస్తుతం లోక్‌సభ స్థానాలు 543 ఉండగా..ఆ సంఖ్య 816కి పెరగనుంది. ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ నియోజకవర్గాలు 175 నుండి 263కు తెలంగాణలో 119 నుండి 179కి చేరతాయి. 2029 ఎన్నికల నుండే నియోజకవర్గాల పునర్విభజన అమలు చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది. దేశవ్యాప్తంగా 4,123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6,185కి చేరనున్నాయి. ఏపీలో లోక్‌సభ స్థానాలు 25 నుండి 38కి, తెలంగాణలో 17 నుండి 26కి చేరే అవకాశం ఉంది. ఇక ఈ నిర్ణయం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక భారీ సంస్కరణ కాబోతోంది. అన్ని పార్టీలను ఒప్పించి 2029 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. దీనివల్ల పాలన ప్రజలకు మరింత చేరువవడమే కాకుండా చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం కూడా గణనీయంగా పెరగనుంది. దీంతో నియోజకవర్గాల పునర్విభజన 2029 ఎన్నికల నుండి అమల్లోకి వచ్చేలా బిల్లు తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతుంది.