రాజ్యసభకు బీజేపీ అగ్రనేత నితిన్ నబీన్

Spread the love

బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లనున్నారు. ఈ మేరకు పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారుచేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయన ఈ సంవత్సరం జనవరిలో పార్టీ జాతీయాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బిహార్ కు చెందిన 46 ఏళ్ల నితిన్ నబీన్ గతేడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బాంకీపుర్ నుండి  నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బిహార్ నుంచి పార్టీ అధ్యక్షుడి స్థాయికి చేరిన నేతగా నబీన్ గుర్తింపు పొందారు. ఇక వివిధ రాష్ట్రాల నుండి రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. బిహార్ నుండి నితిన్ నబీన్, శివేశ్ కుమార్ , తెరాశ గోవాలా, అస్సాం నుండి జొగెన్ మోహన్ ,ఛత్తీస్ ఘడ్ నుండి  లక్ష్మి వర్మ ,హర్యానా నుండి  సంజయ్ భాటియా , ఒడిశా నుండి మన్మోహన్ సమాల్, సుజీత్ కుమార్, పశ్చిమ బెంగాల్ నుండి రాహుల్ సిన్హాలు ఉన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *