రాష్ట్రపతితో ప్రధాని, హోమంత్రి వరుస భేటీలు..!

Spread the love

Modi Amit Shah meet President: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒకే రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీకి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకపోయినా.. సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలే వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీ వెళ్లీ స్వయంగా రాష్ట్రపతిని కలవడం వెనుక ఆంతర్యం ఏంటి? ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా ముర్మను ఎందుకు కలిశారు..? సోషల్ మీడియాలో ఎలాంటి ఊహాగానాలు జోరందుకున్నాయి.? ఏదో కీలక నిర్ణయాన్ని మోదీ తీసుకోబోతున్నారా..? ఎటువంటి సంచలన ప్రకటన రాబోతోంది..?

నోట్ల రద్దు.. ఆర్టికల్ 370 రద్దు.. సర్జికల్ స్ట్రైక్స్.. ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాని మోదీకి సాటి ఎవరూ ఉండరు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఒకే రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. సాధారణంగా ఇలాంటి భేటీలు ప్రత్యేక సందర్భాల్లోనే జరుగుతాయి. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఎలాంటి సందర్భమూ లేదు. దీంతో ప్రధాని మోదీ ఏదో సంచలన నిర్ణయం తీసుకోనున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ముర్ముతో జరిగిన సమావేశంలో జమ్మూకశ్మీర్, ఆర్టికల్ 370 రద్దు జరిగి 6 ఏళ్లు పూర్తికావడం, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంట్ సమావేశాల గురించి చర్చ జరిగినట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. రాష్ట్రపతి భవనంలో ఈ భేటీలు జరిగిన సమయంలో సోషల్ మీడియా, మీడియా వర్గాలు దీనిపై తీవ్ర చర్చలు నడిచాయి.

ఆర్టికల్ 370 రద్దు 2019 ఆగస్టు 5న జరిగి, ఆరేళ్లు పూర్తయింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ నిర్ణయం తర్వాత భద్రతా పరిస్థితులు, రాజకీయ వాతావరణం, అభివృద్ధి కార్యక్రమాలు గణనీయంగా మారాయి. ఈ సమావేశం జమ్మూకశ్మీర్ రాష్ట్ర పునరుద్ధరణ, అసెంబ్లీ ఎన్నికలు, ప్రజాస్వామ్య పునరుద్ధరణపై చర్చలకు వేదికైనట్లు భావిస్తున్నారు. కేంద్రం ఈ అంశంపై కీలక నిర్ణయాలు తీసుకోనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. Modi Amit Shah meet President.

రాష్ట్రపతితో భేటీలో జమ్మూకశ్మీర్ అంశం ప్రముఖంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అమిత్ షా ఇటీవల జమ్మూకశ్మీర్‌లో బీజేపీ నాయకులు, లెఫ్టినెంట్ గవర్నర్‌తో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర పునరుద్ధరణ, అసెంబ్లీ ఎన్నికలు, భద్రతా చర్యలపై దృష్టి సారించారు. ఈ సమావేశం రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలనను పునరుద్ధరించేందుకు కీలకమైన నిర్ణయాలకు దారితీస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. ఈ భేటీలో జమ్మూకశ్మీర్ రాజకీయ భవిష్యత్తును మార్చే నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

అలాగే ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్‌తో పాటు ఇతర కీలక అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌లో ఇటీవలి విపక్షాల ఆందోళనలు, తరుచూ వాయిదాలు పడటం, బీహార్ ఎన్నికల సవాళ్లు, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగింపు వంటి అంశాలపై చర్చ జరిగిందని అంటున్నారు. అలాగే ఎన్నికల కమిషన్ నిర్ణయాలు, క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ, కీలక పదవుల నియామకాలపై కూడా చర్చించినట్టు సమాచారం. అయితే ఇవ్వన్నీ కేవలం ఊహగానాలు మాత్రమే లోపల ఏం జరిగింది మాత్రం ఎవరికీ తెలియదు.

ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు కూడా ఊహాగానాలు వినిపిన్నాయి. జగదీప్ ధన్ కడ్ రాజీనామా తర్వాత ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, ఈ అంశంపై సూత్రప్రాయ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఉపరాష్ట్రపతి పదవికి ధన్ కడ్ రాజీనామా చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని చర్చ జరిగింది. రాజీనామా సమయంలో ధన్ కడ్ రాష్ట్రపతిని కూడా కలిశారని చెబుతున్నారు. దీనిపై ఒక క్లారిటీ అంటూ లేదు. ఇలాంటి సమయంలో రాష్ట్రపతి, ప్రధాని మధ్య ఈ అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

అయితే ప్రధాని మోదీ ఏ కొత్త సంచలన నిర్ణయం తీసుకున్నా.. కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.. నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు, సర్జికల్ స్టైక్స్ వంటి నిర్ణయాలు ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు రాష్ట్రపతి ముర్ముతో భేటీ తర్వాత.. ఏదో నిర్ణయం నిర్ణయం వెలువడనుందని అంటున్నారు. అయితే అది దేనికి సంబంధించిందో ఊహాగానాలు తప్ప సరైన క్లారిటీ లేదు.

అయితే ప్రధాని మోదీ, అమిత్ షా, రాష్ట్రపతి ముర్ము భేటీ దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టనుందని మాత్రం అంటున్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర పునరుద్ధరణ, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంట్ సమస్యలు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయని మాత్రం ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశం దేశ రాజకీయ సమీకరణలను ఎలా మారుస్తుంది? ఏం జరుగబోతోంది అని చర్చ ఊపందుకుంది.

Also Read: https://mega9tv.com/national/criticism-on-mamata-sarkars-decision-in-bengal-government-not-paying-da-to-employees/