రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం..!

Spread the love

Rahul Gandhi vs Supreme Court: రాహుల్ గాంధీ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని గతంలో చేసిన సంచలన వ్యాఖ్యలపై ఇప్పుడు సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు సుప్రీం కోర్టు రాహుల్ గాంధీపై ఎందుకు కోప్పడింది.? అసలు రాహుల్ ఈ వ్యాఖ్యలు రాహుల్ ఎందుకు చేశారు? ఈ ఆరోపణల వెనుక ఉద్దేశం ఏమిటి? రాహుల్ తరుచూ ఆధారాలు లేకుండా ఆరోపణలు ఎలా చేస్తున్నారు..? రాహుల్ గాంధీ తీరుపై ఎలాంటి విమర్శలు వస్తున్నాయి..?

ఒక పార్టీకి నాయకుడంటే ఆయన మాటకు విలువ ఉండాలి. అతడు ఏం చెప్పినా నిజమేన భరోసా కలగాలి. అయితే రాహుల్ గాంధీ తన మాటలకు భరోసా కల్పించలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది. దీనిని ఇటీవల జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. చైనా భారతదేశానికి చెందిన 2,000 చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించిందని, అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైనికులను చైనా సైనికులు కొట్టారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా, సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయని కేంద్ర ప్రభుత్వం, సైనిక బలగాలు, బీజేపీ నాయకులు విమర్శించారు. ఇలాంటి ఆరోపణలకు ఆధారాలు లేవని, దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో అవమానించడానికే రాహుల్ ఇలా మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు.

చైనా భారత భూమిని ఆక్రమించిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయని ఆయన అన్నారు. ఒక బాధ్యతాయుత నాయకుడు దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో అవమానపరిచేలా మాట్లాడకూడదని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై అలహాబాద్ హైకోర్టులో పరువు నష్టం దావా నమోదైంది. సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రాహుల్ దేశ సమస్యలను బహిర్గతం చేస్తున్నారని కొందరు సమర్థించారు. ఇలాంటి వ్యాఖ్యలు బాధ్యతారహితమని, దేశ గౌరవాన్ని దెబ్బతీస్తాయని మరికొందరు విమర్శించారు. Rahul Gandhi vs Supreme Court.

అయితే ఈ పరువు నష్టం కేసు విచారణకు రావడంతో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా 2,000 చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించిందని నీకు ఎలా తెలుసు అని సుప్రీం కోర్టు రాహుల్ గాంధీని నిలదీసింది. నీవు నిజమైన భారతీయుడివైతే ఇలాంటి ఆరోపణలు చేయవు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా ఎందుకు చర్చించలేదని, సోషల్ మీడియా తరహాలో ఆధారాలు లేకుండా మాట్లాడటం సరైనది కాదని కోర్టు సూటిగా చెప్పింది. రాహుల్‌ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. దేశంలో ఉన్న సమస్యలను ప్రశ్నించకపోతే రాహుల్‌ ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతారని వాదించారు. దీంతో ఆగ్రహించిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఏదైనా సమస్య లేదా విషయంపై మాట్లాడాలంటే పార్లమెంటులో మాట్లాడాలని.. సోషల్‌ మీడియాలో కాదని పేర్కొంది. ఇటువంటి సమస్యలను పార్లమెంటులో ఎందుకు లేవనెత్తరని ప్రశ్నించింది.

అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాహుల్ గాంధీకి కొత్త కాదు. 2019లో కర్ణాటకలో ఒక ఎన్నికల సమావేశంలో మోదీ అనే పేరున్నవారు అందరూ దొంగలా అని వ్యాఖ్యానించి, పరువు నష్టం కేసు ఎదుర్కొన్నారు. ఆ కేసులో క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఎన్నికల సంఘం వ్యవస్థ చనిపోయిందని, ఎన్నికల కమిషన్ బానిసలా పనిచేస్తోందని వ్యాఖ్యలు చేశారు. మరణించిన మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తనను బెదిరించారని ఆరోపించడం కూడా వివాదాస్పదమైంది.

కాంగ్రెస్ కార్యకర్తల్లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఉత్సాహాన్ని నింపుతున్నాయి, కానీ ప్రజల్లో విశ్వసనీయతను తగ్గిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు తొందరపాటు నిర్ణయాలుగా అభివర్ణించారు. సోషల్ మీడియా యుగంలో నాయకులు చేసే ప్రతి మాట లెక్కలోకి వస్తుంది. నిరాధార ఆరోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలు రాహుల్‌పై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, యువతలో రాహుల్ వ్యాఖ్యల్లో విశ్వసనీయత గురించి ప్రశ్నలు తలెత్తతున్నాయి.

నిరాధార ఆరోపణలు రాహుల్ గాంధీ ఎందుకు చేస్తున్నారు?
కాంగ్రెస్ బలహీనతను దాచడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి, మీడియా దృష్టిని ఆకర్షించడానికి రాహుల్ ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ సరైన ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ఆయనకు నష్టం కలిగిస్తోంది. ప్రజల్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోతోంది. కీలక నియోజకవర్గాల్లో ఈ వ్యాఖ్యలు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పార్లమెంటరీ వేదికను వాడవచ్చు కానీ తప్పుడు ఆరోపణలు చేయకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. యథార్థ ఆధారాలతో మాత్రమే వ్యాఖ్యలు చేయాలని నాయకులకు గుర్తు చేసింది. ఒక నాయకుడు ప్రజల్లో నిజాయితీగా కనిపించకపోతే, ఎంత ప్రచారం చేసినా ఫలితం ఉండదు. రాహుల్ వ్యాఖ్యలు దేశ సమస్యలను లేవనెత్తడానికి ఉద్దేశించినవైనా, ఆధారాలు లేకపోవడం వల్ల ఆయన విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. రాజకీయ నాయకుడిగా బాధ్యతాయుతంగా మాట్లాడటం, ఆధారాలతో మాట్లాడటం ప్రజల నమ్మకాన్ని చూరగొనడానికి కీలకం.

Also Read: https://mega9tv.com/national/pm-modi-amit-shah-meet-president-murmu-separately/