మిడిల్ ఈస్ట్ పరిస్థితి సహా  కీలక అంశాలపై ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోడీ

Spread the love

ఇరాన్ అధ్యక్షులు డాక్టర్ మసూద్ పెజెష్కియాన్‌ తో ప్రధాని మోడీ నేడు ఫోన్ ద్వారా సంభాషించారు. ఈమేరకు వారికి ఈద్ మరియు నౌరూజ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సీజన్ పశ్చిమ ఆసియాలో శాంతి, స్థిరత్వం మరియు సంపదను తీసుకురావాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.  ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తూ, ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం కలిగిస్తున్న కీలకమైన మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ప్రధాని మోడీ ఈ సందర్భంగా ఖండించారు. నౌకాయాన స్వేచ్ఛను కాపాడటం మరియు రవాణా మార్గాలు సురక్షితంగా, అడ్డంకులు లేకుండా ఉండేలా చూడటం యొక్క ప్రాముఖ్యతను మరోసారి పునరుద్ఘాటించారు. ఇరాన్‌ లోని భారతీయ పౌరుల రక్షణ మరియు భద్రత కోసం ఇరాన్ అందిస్తున్న నిరంతర మద్దతు పట్ల  అభినందించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *