ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలకు దేశ వ్యాప్తంగా నేడు అంతరాయం ఏర్పడనుంది. వారానికి ఐదు రోజుల వర్క్ పాలసీని వెంటనే అమలు చేయాలని కోరుతూ బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (యూఎఫ్ బీయూ) పిలుపు మేరకు డిమాండ్లపై చీఫ్ లేబర్ కమిషనర్తో ఈ నెల 23న జరిపిన చర్చలు జయప్రదం కాకపోవడంతో బ్యాంకు అధికారులు, సిబ్బందికి ప్రాతినిధ్యం వహిస్తున్న తొమ్మిది సంఘాల ఉమ్మడి వేదిక యూఎఫ్ బీయూ సమ్మె పిలుపునిచ్చింది. ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు సాధారణంగానే పనిచేస్తున్నాయి.డిజిటల్ సేవలు UPI, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి ఆన్‌లైన్ సేవలు యథావిధిగా పనిచేస్తాయి. అయితే, కొన్ని ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది.