ఆర్థిక సంక్షోభం పొంచి ఉంది ..కేంద్రంపై మరోసారి రాహుల్ గాంధీ విమర్శలు

Spread the love

దేశ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక భయంకరమైన ఆర్థిక సంక్షోభం పొంచి ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఆయన తన సొంత నియోజకవర్గం రాయ్ బరేలీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు చేశారు. దేశానికి  ఒక ఆర్థిక సంక్షోభం పొంచి ఉందని అన్నారు. ఇక ఇటీవల ప్రధాని మోడీ దేశ ప్రజలకు చేసిన విజ్ఞప్తులను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. దేశంలో సంక్షోభ పరిస్థితులలో  ప్రజలను బయటకు వెళ్లొద్దని ప్రధాని పిలుపునిచ్చిన విషయంపై స్పందిస్తూ  ఆయనేమో ప్రపంచమంతా చుట్టేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  ఇక 12 ఏళ్లలో మోదీ నిర్మించిన ఆ నిర్మాణం కేవలం అదానీ మరియు అంబానీల కోసమేనని ఆరోపించారు. ఇప్పుడు, అదే నిర్మాణం కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ దెబ్బ వారిపై పడదని వారు తప్పించుకునే మార్గాలు వారి దగ్గర ఉన్నాయని ఆ దెబ్బ సామాన్యులపై పడుతుంది. యువతపై, పేదలపై, మధ్యతరగతిపై, రైతులపై, కార్మికులపై, చిన్న వ్యాపారులపై ఎవరైతే అసలు ఆ నిర్మాణంలో భాగమే కారో వారిపై పడుతుందన్నారు. మీ చుట్టూ ఒకసారి చూసుకోండి. మీరు ఆ నిర్మాణంలో భాగమా లేక ఆ తుఫానుకు బాధితులా అని రాహుల్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు ప్రతి వస్తువు ధర పెరుగుతుందని అన్నారు. ప్రజలకు సహాయం చేయాలని, రైతులను, కార్మికులను, చిన్న వ్యాపారులను రక్షించాలని నేను  ప్రతిరోజూ నరేంద్ర మోదీకి చెబుతున్నాను, కానీ వారు ప్రజలకు సహాయం చేయడానికి ఇష్టపడడం లేదు. నరేంద్ర మోదీ గత 10 ఏళ్లలో కేవలం ద్వేషాన్ని వ్యాప్తి చేసే రాజకీయాన్నే చేశారని విమర్శించారు. తాను  పార్లమెంటులో మాట్లాడటం ప్రారంభించగానే, మైక్ స్విచ్ ఆఫ్ అవుతుందని నిజం మాట్లాడడం వలనే బీజేపీ వాళ్ళు మైక్ ఆఫ్ చేస్తున్నారన్నారు. అంబానీ, అదానీ పైనా రాహుల్ విమర్శలు గుప్పించారు. అంబానీ హిందుస్తాన్ నుండి వేల కోట్ల రూపాయల విలువైన చమురును విదేశాలలో విక్రయిస్తున్నారని కానీ నరేంద్ర మోదీ ఆయనను అడ్డుకోవడం లేదన్నారు. ఒకరోజు అదానీ-అంబానీ పారిపోయి, తమ ప్యాలెస్‌లలో దాక్కుంటారు, ఆ నష్టాన్ని కేవలం పేద ప్రజలు మాత్రమే భరించాల్సి వస్తుందని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *