బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సామ్రాట్ చౌదరి

Spread the love

బీహార్ 21వ  సీఎంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరి నేడు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో గవర్నర్ సయ్యద్ అతా హోస్నైన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీహార్ ఎన్డీయే కూటమి కీలక నేతలు హాజరయ్యారు. బీజేపీ నుండి బీహార్ సీఎంగా ఎన్నికైన నేతగా నిలిచారు. జేడీ (యూ) అధినేత నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికై సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ కు సీఎం పదవి లభించింది. ఇక బిజేంద్ర ప్రసాద్ యాదవ్, విజయ్ కుమార్ యాదవ్ లు డిప్యూటీ సిఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక బీహార్ ప్రభుత్వ ప్రధాన సచివాలయంలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి సంబంధిత అధికారులతో పరిచయ సమావేశాన్ని కూడా నిర్వహించారు. బీహార్ ప్రయోజనాలే పరమావధిగా విధులను నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *