కర్ణాటక చరిత్రలో అత్యధిక కాలం కొనసాగిన సీఎంగా సిద్దరామయ్య రికార్డు

Spread the love

కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆ రాష్ట్ర చరిత్రలో ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా పని చేసిన నేతగా సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఇది వరకు దేవరాజ అరసు 7 సంవత్సరాల 239 రోజుల రికార్డును సిద్దరామయ్య నేటితో అధిగమించబోతున్నారు. అయితే దేవరాజ అరసు బ్రేక్ లేకుండా కొనసాగారు. సిద్దరామయ్య 2013-2018వరకు అలాగే తిరిగి 2023 నుంచి ప్రస్తుత కాలం వరకు సీఎంగా కొనసాగుతున్నారు. అరసు, సిద్ధరామయ్య తర్వాత నిజలింగప్ప మాత్రమే ఏడేళ్లకు పైగా సీఎంగా పని చేశారు. ఇక దీనితో పాటు మరో రికార్డును కూడా ఆయన తన ఖాతాలో వేసుకోనున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నా ఆర్థికశాఖ కూడా సిద్ధరామయ్య వద్దే ఉంది.  ఆర్థిక మంత్రిగా 16 బడ్జెట్లు ప్రవేశపెట్టిన నేతగా కూడా సిద్ధరామయ్య చరిత్ర  సృష్టించారు. రానున్న మార్చిలోనూ తానే బడ్జెట్ ప్రవేశపెడతానని, 2028 వరకు సీఎంగా  కొనసాగుతానని సిద్ధరామయ్య ప్రకటించారు. సీఎంగా ఆయన రికార్డు నేపథ్యంలో అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.