ఐఐటీ కాన్పూర్ కు స్టూడెంట్స్ భారీ విరాళం

Spread the love

ప్రతిష్టాత్మక ఉత్తరప్రదేశ్ లోని ఐఐటీ కాన్పూర్ లో 1976 బ్యాచ్ స్టూడెంట్స్ తాము చదువుకున్న సంస్థకు ఆర్దికంగా అండగా నిలబడ్డారు. అక్కడి క్యాంపస్ లో చదివి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రూ.13.40 కోట్ల డొనేషన్ అందించారు. ఈ బ్యాచ్ లో చదువుకున్న వారంతా వివిధ దేశాలలో ఉన్నత స్థాయిలో సెటిలై ఉన్నారు. 50 సంవత్సరాల క్రితం తమ స్టూడెంట్ లైఫ్ ను గుర్తు చేసుకుంటూ ఆ ఆనంద క్షణాలను మరోసారి తమ స్నేహితులతో కలిసి ఆస్వాదించారు. క్లాస్ రూమ్ లు వాటితో పెనవేసుకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సెల్ఫీలతో సందడి చేశారు. ఈ విద్యాసంస్థ స్టూడెంట్స్ సాధించిన విజయాలు అనుసరిస్తున్న విలువల పట్ల గర్వంగా ఉందని ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్, ప్రొఫెసర్ మణింద్ర అగర్వాల్ పేర్కొన్నారు.